మరో 3 రోజుల్లో ‘భీమ్లా నాయక్’ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో పవన్ అభిమానుల్లో విపరీతమైన జోష్ నెలకొంది. ఫిబ్రవరి 25న భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా తెరకెక్కిన సినిమా ఇది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేశారు. డైలాగులు కూడా ఓ రేంజ్లో పేలబోతున్నాయని నిన్న విడుదలైన ట్రైలర్ స్పష్టంచేసింది.
తమన్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ కు అంత స్పెషల్ అట్రాక్షన్ కాలేదు. అయితే సినిమాలో మాత్రం అదిరిపోతుందని తమన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ ను షేక్ చేసాయి. అయితే ఓ పాటని మాత్రం టైటిల్ ఎండ్ కార్డ్స్ లో వేయబోతున్నారట. ఆ పాట మరేదో కాదు ‘లాల భీమ్లా’. నిజానికి ‘భీమ్లా’ పై అంచనాలను పెంచిన పాట ఇది. త్రివిక్రమ్ ఈ పాటకి సాహిత్యం సమకూర్చడం కూడా జరిగింది.
కానీ ఇప్పుడు ఈ పాటని సినిమాలో సైడ్ చేసేసి.. నామ్ కె పాస్ అన్నట్టు జనాలు థియేటర్ నుండీ బయటకి వెళ్ళిపోయే టైంలో వేయడానికి సన్నాహాలు చేస్తుండడం షాకిచ్చే అంశమే. పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమా టైములో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమా టైటిల్ సాంగ్ ను తీసుకెళ్ళి లాస్ట్ లో ఎండ్ టైటిల్ కార్డ్స్ పడే టైములో పెట్టారు. తర్వాతి రోజున మళ్ళీ దానిని మొదటికి చేర్చారు.
కానీ అప్పటికే సినిమాకి నెగిటివ్ రిపోర్ట్స్ రావడంతో ఆ పాట వేస్ట్ అయిపోయింది. ఒకవేళ హిట్ టాక్ వచ్చినా అలాంటి మంచి పాటల్ని చివర్లో పెడితే అంతగా రీచ్ అవ్వదు. మరి ‘భీమ్లా’ మేకర్స్ ఆలోచన ఏంటో తెలియాల్సి ఉంది.