ఆమిర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా నాగ చైతన్య కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ – జ్యోతి దేశ్ పాండే – అజిత్ అందరే కలిసి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ – వయాకామ్ 18 బ్యానర్ల పై నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో రిలీజ్ చేయడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఆగస్టు 5న విడుదల కాబోతున్న ‘లాల్ సింగ్ చడ్డా’ కి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
1.0 cr
సీడెడ్
0.25 cr
ఆంధ్ర
13 cr
ఏపీ + తెలంగాణ
2.55 cr
‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.చాలా వరకు అడ్వాన్స్ బేసిస్ పైనే ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే … రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆమిర్ ఖాన్ చిత్రాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. నాగ చైతన్య ఉన్నాడు కాబట్టి.. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున కూడా కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకున్నారు.
గత వారం రిలీజ్ అయిన ‘సీతా రామం’ ‘బింబిసార’ వంటి చిత్రాలు ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ వీకెండ్ ‘మాచర్ల నియోజకవర్గం’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి ‘లాల్ సింగ్ చడ్డా’ టార్గెట్ ను రీచ్ అవ్వడం అంత ఈజీ కాదనే చెప్పాలి.