తెలుగు అమ్మాయిని అయినందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
- November 22, 2017 / 12:35 PM ISTByFilmy Focus
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పురస్కరించే నంది అవార్డు మరోసారి మంచు ఆణిముత్యాన్ని వరించింది. గతంలోనే ఉత్తమ ప్రతినాయకురాలిగా అనగనగా ఓ ధీరుడు సినిమాకు నంది అందుకున్న మంచు లక్ష్మిని ఇప్పుడు మరోసారి నంది వరించింది. చందమామ కథలు సినిమాలోని నటనకు గానూ, మంచు లక్ష్మికి ఉత్తమ సహాయనటి అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను గౌరవించింది. చందమామ కథలు సినిమాలో లీసా స్మిత్ పాత్రలో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్న మంచు లక్ష్మి ఆ పాత్రకు 100% న్యాయం చేసింది. తనకు ఈ అవార్డు రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. తెలుగు అమ్మాయిగా తనకెంతో గర్వంగా ఉందని, ఈ అవార్డు ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి మంచు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














