Lakshyam Movie Collections: 14 ఏళ్ళ ‘లక్ష్యం’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

గోపీచంద్, అనుష్క హీరో హీరోయిన్లుగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్యం’. జగపతి బాబు, కళ్యాణి.. కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించాడు. 2007 వ సంవత్సరం జూలై 5న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైంది ‘లక్ష్యం’ మూవీ..! కానీ మొదటి షోతోనే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ గా గోపీచంద్(హీరోగా) కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

మరి బాక్సాఫీస్ వద్ద ‘లక్ష్యం’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 4.95 cr
సీడెడ్ 1.47 cr
ఉత్తరాంధ్ర 1.54 cr
ఈస్ట్ 0.85 cr
వెస్ట్ 0.73 cr
గుంటూరు 0.88 cr
కృష్ణా 0.94 cr
నెల్లూరు 0.47 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  1.92 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  13.75 cr

 

‘లక్ష్యం’ చిత్రానికి రూ.5.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బయ్యర్స్ పెట్టిన పెట్టుబడి మొత్తం ఫస్ట్ వీకెండ్ లోనే వెనక్కి రాబట్టింది ఈ చిత్రం. ఇక ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.13.75 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.8.35 కోట్ల లాభాలు మిగిలినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus