కరోనా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా.. ప్రతీ ఒక్కరికి గజ గజ వణికించేస్తోంది. జనాలు మాస్క్ లు వేసుకుని.. సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెలెబ్రిటీలు కూడా దీని నుండీ ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అనేదాని పై సూచనలు ఇస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లు కూడా దీని పై ఓ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనా వల్ల చాలా వరకూ బిజినెస్ లు దెబ్బ తింటున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా సినిమా పరిశ్రమ పై పెద్ద దెబ్బె కొట్టింది. ఈ నెల 31వరకూ థియేటర్లను మూసి వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. చాలా వరకూ షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. అయితే దీని వల్ల నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ కు మాత్రం బాగా కలిసొస్తుందనే చెప్పాలి. చాలా వరకూ ఆఫీసులకి ‘వర్క్ ఫ్రొం హోమ్’ ఫెసిలిటీ కల్పించారు. ఇక స్కూల్స్ కు సైతం సెలవులు ప్రకటించారు. దీంతో ఇంట్లో ఉన్నవారంతా.. ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాలు చూస్తుండడం విశేషం. గత వారం విడుదలైన బ్రహ్మాజీ కొడుకు ‘ఓ పిట్ట కథ’ సినిమాని అప్పుడే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. కొత్త సినిమా కాబట్టి.. ఈ చిత్రాన్ని ఓటిటి లో ఎగబడి చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని చాలా చిన్న సినిమాల మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు వారాలు కొత్త సినిమాలను ఎక్కువగా బుల్లితెర పై చూడొచ్చు అన్న మాట..!
Most Recommended Video
యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!