Lavanya Tripathi: నెంబర్‌ 1పై లావణ్య కామెంట్స్‌… ఏమందంటే?

సినిమా ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు ఎవరైనా నెంబర్‌ గేమ్‌ను ఇష్టపడతారు. ఎప్పుడూ నెంబర్‌ వన్‌లో ఉండాలని అనుకుంటున్నారు. అది హీరోయిన్‌ అయినా, హీరో అయినా, టెక్నీషియన్‌ అయినా అదే ఆలోచన చేస్తారు. నిత్యం నెంబర్‌ 1 కష్టం కాబట్టి.. నెంబర్‌ 1 ప్లేస్‌ను కెరీర్‌లో ఒక్కసారైనా టచ్‌ చేయాలి అనుకుంటారు. అలాంటి నెంబర్‌ 1 ప్లేస్‌ గురించి కథానాయిక లావణ్య త్రిపాఠి కీలక వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌లో నెంబర్‌ 1 ప్లేస్‌కి ఉన్న ప్రాముఖ్యతను చెప్పింది. ఇప్పుడు ఆ కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ఇలాంటి పాత్రలే చేయాలని ఆలోచించను. నటిగా బలమైన పాత్రలే చేయాలనుకుంటాను. చేసిన పాత్రలే మళ్లీ చేయడం నచ్చదు. అందుకే అందరికీ నేను సినిమాలు తగ్గించినట్లు అనిపిస్తుండొచ్చు అని అంటోంది లావణ్య త్రిపాఠి. అమె చెప్పినట్లే లావణ్య ఒకేలాంటి పాత్రలు చేయడం అరుదే. ఇప్పుడు సరికొత్త పాత్రలో ‘హ్యాపీ బర్త్‌డే’తో 8వ తేదీన వస్తోంది. ఆ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో నెంబర్‌ గేమ్‌ గురించి మాట్లాడింది.

పదేళ్లుగా చిత్రసీమలో ఉండటమే ఆనందం. అయితే నెంబర్‌ గేమ్ గురించి అందరూ అంటుంటారు. నిజానికి అందరూ నంబర్‌ 1కు వెళ్లలేరు. నా వరకు నా పనిని ఎంజాయ్‌ చేస్తున్నాను. మనసుకు నచ్చిన పాత్రల్నే చేస్తున్నా. సినిమాల ఛాన్స్‌ల కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకోవడం లేదు. ఆ అలవాటు ఎప్పుడూ లేదు. ఫలానా పాత్రలు చేయాలని లక్ష్యాలేమీ లేవు. మనసుకు నచ్చిన పాత్రల్ని, కొత్తగా అనిపించిన పాత్రల్ని చేయడం నాకు అలవాటు. అదే పని చేస్తున్నాను అని చెప్పింది లావణ్య.

ఇక సినిమా గన్స్‌ మోసినట్లున్నారుగా బరువనిపించలేదా? అని అడిగతే… రోజూ జిమ్‌లో ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తాను. బాక్సింగ్‌ కూడా చేస్తుంటా. కాబట్టి యాక్షన్‌ క్యారెక్టర్‌ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా. ఇప్పటికి కుదరింది. అయితే ఈ సినిమాలో గన్స్‌ మోయడం కష్టంగా అనిపించింది. నిజమైన తుపాకులే వాడటంతో చాలా బరువున్నాయి. ట్రైలర్‌లో కనిపించే పెద్ద గన్‌ తొమ్మిది కేజీలకు పైనే ఉంటుంది. దాన్ని మోస్తూ షూట్‌ చేయడం కష్టమనిపించింది అని చెప్పింది లావణ్య.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus