హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ‘అందాల రాక్షసి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత ‘దూసుకెళ్తా’ ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘మిస్టర్’ ‘రాధా’ ‘యుద్ధం శరణం’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ‘ఇంటిలిజెంట్’ ‘అంతరిక్షం’ ‘అర్జున్ సురవరం’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ‘చావు కబురు చల్లగా’ ‘హ్యాపీ బర్త్ డే’ వంటి చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఎదగకపోయినా.. మంచి మంచి పాత్రలే చేసింది.
మంచి నటి కూడా..! హద్దులు మించిన ఎక్స్పోజింగ్ అయితే ఎప్పుడూ చేయలేదు. ఇక ఈమె చాలా సైలెంట్ గా మెగా వారి ఇంటి కోడలు అయిపోతున్న సంగతి తెలిసిందే. 2016 లో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిన ఈ బ్యూటీ త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుంది. అయితే లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయం పై ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది.
1995 డిసెంబర్ 15 న ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్లో జన్మించింది (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి. అయితే పెరిగింది అంతా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో..! ఈమె తండ్రి ఓ లాయర్. తల్లి టీచర్, ఆమె అక్క కమిషనర్..! లావణ్య కి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. డెహ్రాడూన్ లో స్కూలింగ్ అయ్యాక ముంబైలోని రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది లావణ్య త్రిపాఠి. ఆమె కుటుంబంలో వారంతా ఒకరితో ఒకరికి సంబంధం లేని వృత్తుల్లో ఉండటం వల్ల..
తాను మోడలింగ్ రంగంలో అడుగుపెట్టాలని, సినిమాల్లో రాణించాలని డిసైడ్ అయినట్టు ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అందుకు ఈమె కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలిపారట. ఓవరాల్ గా లావణ్య త్రిపాఠి ఎతిక్స్, మోరల్స్ వంటి వాటికి కట్టుబడి ఉండే ఫ్యామిలీ అని తెలుస్తుంది. అందుకే వరుణ్ తేజ్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ అంగీకరించినట్లు సమాచారం.