Lavanya Tripathi: నెటిజన్ ప్రపోజల్ కు లావణ్య రియాక్షన్ ఇదే.. ఆ ఛాన్స్ లేదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుని క్యూట్ కపుల్ అనిపించుకున్న జోడీలలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జోడీ ఒకటి. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడం గురించి ఇప్పటికే ఆమె క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాలు బెణకడం వల్ల ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న లావణ్య ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు. పవన్, నిహారికల గురించి, ఇతర విషయాల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పాలని నెటిజన్లు కోరగా పవర్ అంటూ సమాధానం ఇచ్చిన లావణ్య నిహారిక బెస్టీ అని జవాబిచ్చారు. అయితే సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు ఎవరూ ప్రపోజ్ చేయరనే సంగతి తెలిసిందే. అయితే ఒక నెటిజన్ మాత్రం ఈ జన్మలో మ్యారేజ్ చేసుకోవాలన్నా కుదరలేదని వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుందామని కామెంట్ చేశాడు.

అయితే లావణ్య మాత్రం ఆ కామెంట్ కు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయిస్తారని ఈ జన్మలోనే కాదు ఏడు జన్మలకు అతనే భర్త అని నమ్ముతారని ఆ విధంగా ఏడు జన్మలకు వరుణ్ తేజ్ భర్త అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు. లావణ్య త్రిపాఠి జవాబుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నటించిన సినిమాలలో టఫ్ మూవీ మొదటి సినిమా అని లావణ్య తెలిపారు.

ఆ సమయంలో భాషకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆ సమయంలో మెట్లపై నుంచి కింద పడ్డానని వ్యానిటీ వ్యాన్ కూడా లేదని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చారు. మేకప్ లేదని హెయిర్ స్టైలిష్ట్ లేరని ఆమె వెల్లడించడం గమనార్హం. అందాల రాక్షసి సినిమా గురించి లావణ్య త్రిపాఠి ఈ కామెంట్లు చేశారు. మిథున పాత్ర షూటింగ్ అనుభవాలు మాత్రం సంతోషాన్ని కలిగించాయని ఆ సినిమా సమయంలో పని చేసిన వాళ్లు ఎంతో మంచివాళ్లు అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus