Lavanya Tripathi: ఫ్రీ పోన్ అయినా లావణ్య హ్యాపీ బర్త్ డే.. విడుదల ఎప్పుడంటే?

మత్తువదలరా.. ఫెమ్ రితేష్ రానా దర్శకత్వంలో,క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో లావణ్యత్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హ్యాపీ బర్త్ డే.ఎంతో ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ పాటలు సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాటి ఈ సినిమాతో మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంటుందని అందరూ భావించారు.

ఇకపోతే ఈ సినిమా జూలై 15వ తేదీ విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ఇలా విడుదల తేదీని ఖరారు చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని విడుదల తేదీ కన్నా ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.ఈ విధంగా జూలై 15వ తేదీ రావాల్సిన ఈ సినిమా జూలై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఒక వారం రోజుల ముందుగానే ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈ సినిమా విడుదల ఫ్రీ ఫోన్ చేయడంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.ఇక విడుదల తేదీ కన్నా ఒక వారం ముందుగానే ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం నాని నటించిన భలే భలే మగాడివోయ్ , సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో మంచి హిట్ అందుకున్న లావణ్య ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే లావణ్య ఆశలన్నీ కూడా తన హ్యాపీ బర్త్ డే సినిమాపై పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తోందో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus