Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి నెక్స్ట్‌ ఏంటి.. చెప్పాలమ్మా!

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలోకి ‘అందాల రాక్షసి’ అడుగుపెట్టి పదేళ్లు అయింది. ఈ క్రమంలో వరుస సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అయితే సాధించలేకపోయింది. పెద్ద హీరోలతో, కుర్ర స్టార్లతో నటిస్తున్నా ఆ గుర్తింపు అయితే రావడం లేదు. అయితే సినిమా ఛాన్స్‌లు అయితే వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో లావణ్య త్రిపాఠి మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఆమె రీసెంట్‌ సినిమా ‘హ్యాపీ బర్త్‌డే’ రిజల్ట్‌ చూశాక.. ఆ ప్రశ్నకు సమాధానం యస్‌ అనే వస్తుంది.

లావణ్య త్రిపాఠికి అందం ఉంది, మంచి ఫిజిక్‌ ఉంది, నటన బాగుంటుంది, డ్యాన్స్‌లు బాగానే వేస్తుంది. అయితే వీటన్నింటిని కలిపి చేసినప్పుడు ఏదో మిస్‌ అవుతోంది. అదే స్టోరీ సెలక్షన్‌ అని అంటున్నారు పరిశీలకులు. ఆమె రీసెంట్‌ సినిమాలు చూస్తే.. హిట్‌ పక్కా అనే మాట వినిపిస్తోంది. అయితే తెర మీద చూసేసరికి లావణ్య అంతా ఓకే.. మంచి కథ ఎంచుకుంటే ఆడేసేది అని అంటున్నారు ఫ్యాన్స్‌. ఇప్పుడు ‘హ్యాపీ బర్త్‌డే’ విషయంలోనూ అంతే. సినిమా కొత్తగా కనిపించి, వినిపించినా.. చూసేసరికి అంత సీన్‌ లేదు అనాల్సి వస్తోంది.

అలా అని లావణ్య తొలి నుండీ ఇలాంటి సినిమాలే ఎంచుకుంటుందో అంటే లేదనే చెప్పాలి. ‘అందాల రాక్షసి’తో 2012లో వచ్చింది. ఆ తర్వాత ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ’, సోగ్గాడే చిన్ని నాయనా’, శ్రీరస్తు శుభమస్తు’ లాంటి హిట్‌ కథలే ఎంచుకుంది. ఆ తర్వాత ‘లక్ష్మీదేవికి ఓ లెక్కుంది’ నుండి లెక్క తప్పింది. ఆ సినిమా తర్వాత ‘మిస్టర్‌’, ‘రాధ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘యుద్ధం శరణం’, ‘ఇంటెలిజెంట్‌’, ‘అంతరిక్షం’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలు ఎంచుకుని దెబ్బతింది లావణ్య.

మధ్యలో ‘అర్జున్‌ సురవరం’తో విజయం అందుకున్నా.. అది సరిపోలేదు. ఇప్పుడు లావణ్య చేతుల్లో ఏ సినిమా కూడా లేదు. అయితే ఏ అవకాశమూ లేదు అనుకున్నప్పుడు వరుస అవకాశాలు తిరిగి సంపాదించడం లావణ్యకు బాగా తెలుసు. గతంలో ఇలాంటి పరిస్థితులు దాటే వచ్చింది లావణ్య. అయితే ఇప్పుడు ఆమె చేతుల్లో ఉన్న అస్త్రాలన్నీ అయిపోయాయి. అన్ని రకాల లావణ్యను చూపించేసింది. మరిప్పుడు కొత్త లావణ్యను ఎలా చూపిస్తుంది అనేది చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus