Lavanya Tripathi: వరుణ్-లావణ్య.. ఆ ఒక్క ఫోటో ఎంత రచ్చ రచ్చ చేస్తుంది..!

నిన్న వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది.అలా అని అది నిన్నటితో ముగిసిపోలేదు .. ఈరోజుకీ వైరల్ అవుతూనే ఉంది. విషయంలోకి వెళ్తే మెగా హీరో వరుణ్ తేజ్ రూ.25 లక్షల విలువైన డైమండ్ రింగ్ తీసుకొని బెంగుళూరు వెళ్ళాడట.. అక్కడ ఓ హీరోయిన్ కి పెళ్లి ప్రపోజల్ చేయబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. లావణ్య త్రిపాఠి.వీళ్ళిద్దరూ కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌’ అనే సినిమాల్లో నటించారు.

ఇవి రెండు డిజాస్టర్లే. అయితే ఈ సినిమాల దగ్గర్నుండీ లావణ్య.. వరుణ్ లు బాగా క్లోజ్ అయ్యారట.నిహారిక పెళ్లి సంబరాల్లో కూడా లావణ్య త్రిపాఠి మునిగితేలింది.మెగా ఫ్యామిలీతో కూడా ఆమె సాన్నిత్యం పెరిగిందని చాలా వార్తలు వినిపిస్తున్నాయి.ఓ సందర్భంలో నిహారికని కూడా.. ‘ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?’ అని ప్రశ్నించగా ‘అన్నతో రెండు సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠినే’ అని సమాధానం ఇచ్చింది. ఫైనల్ గా వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠీ ల పెళ్ళైతే ఫిక్స్ అని బలంగా వినిపిస్తున్న టాక్.

ఈ వార్తలకి మరింత ఆజ్యం పోస్తూ.. మెగా ఫ్యామిలీతో ఇటీవల లావణ్య దిగిన ఓ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో అందరూ మెగా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు ఒక్క లావణ్య త్రిపాఠి తప్ప. దీంతో అటు అభిమానుల్లోనూ… ఇటు సోషల్ మీడియాలోనూ మరింత అనుమానాలు పెరిగాయనే చెప్పాలి. మొన్నామధ్య దర్శకుడు బోయపాటి చెబుతూ.. ‘ఇక్కడ ఇది జరుగుద్ది అనేది ఉండదు.. ఇక్కడ ఇది జరుగుతుందా? అనేది కూడా ఉండదు.. ఏదైనా జరగొచ్చు’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి వరుణ్-లావణ్య ల విషయంలో ఆయన కామెంట్ నే కన్క్లూజన్ గా తీసుకుంటే బెటర్.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus