ఒకప్పుడు ఆదివారం రాత్రి 8 గంటల 30 నిముషాలు అయితే చాలు అందరూ.. టీవీల ముందు అతుక్కుపోయేవారు. కారణం ‘అమృతం’ సీరియల్. టీవీ సీరియల్స్ లో ‘అమృతం’ కు ప్రత్యేక స్థానం ఉంది. చెప్పాలంటే ఇది ఒక ట్రెండ్ సెటర్. ఎటువంటి సాగదీత లేకుండా ప్రతీ వారం ఓ కొత్త ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు మేకర్స్. కామెడీ విషయంలో కూడా ఇది డిఫరెంట్ జోనర్ అనే చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ జోక్ లు ఇందులో ఉండేవి కావు.
సందర్భానికి తగినట్టు వచ్చే పంచ్ లు ప్రేక్షకులని బాగా అలరించేవి. ‘అమృతం’ పాత్రలో మొదట శివాజీ రాజా.. తరువాత సీనియర్ హీరో నరేష్.. అటు తరువాత హర్షవర్ధన్ లు చేసారు. ఇక ఆంజనేయులు పాత్రలో గుండు హనుమంతు రావు … కొనసాగుతూ వచ్చాడు. అయితే సీజన్2 ప్రారంభించాలి అనుకునే టైంకి అతను ఈ లోకానికి దూరమైపోయాడు. దాంతో సీజన్ 2 కి ఆయన పాత్రలో ఎల్.బి.శ్రీరామ్ ను తీసుకున్నారు. ఇప్పటికే ‘అమృతం ద్వితీయం’ నుండీ 5 ఎపిసోడ్ లు వరకూ రిలీజ్ చేశారు.
ఉగాది సందర్బంగా మార్చి 25న ప్రారంభించారు. కానీ దీనికి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదని తెలుస్తుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఎల్.బి.శ్రీరామ్ కూడా ‘మేము ఒకటి ప్లాన్ చేస్తే… భగవంతుడు ఇంకోటి ప్లాన్ చేసాడు’ అంటూ కామెంట్ చెయ్యడంతో.. ‘అమృతం ద్వితీయం’ కు అంత ఆదరణ దక్కడం లేదని తెలుస్తుంది.దాంతో ఇప్పుడు లాక్ డౌన్ స్పెషల్ అంటూ మరో రెండు మరింత ఫన్ తో కూడిన ఎపిసోడ్ లను రిలీజ్ చేయనున్నారట.మరి అవి అయినా ఆకట్టుకుంటాయేమో చూడాలి.
Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!