Salaar Movie: ఆ లీక్స్ వల్ల సలార్ కు భారీగా నష్టం జరుగుతోందా?

2023 సంవత్సరంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ కానున్న సినిమాలలో సలార్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపుగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలి2 సినిమాతో సాధించిన కలెక్షన్ల రికార్డులను కచ్చితంగా బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. కేజీఎఫ్2 సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే అనే సంగతి తెలిసిందే. అయితే సలార్ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అనధికారికంగా లీక్ అవుతుండటంతో కొందరు ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతుంటే కొందరు ఫ్యాన్స్ మాత్రం బాధగా ఫీలవుతున్నారు.

లీకవుతున్న ఫోటోలు, వీడియోలు బాగానే ఉన్నా ఈ లీక్ వీడియోల వల్ల సినిమాకు నష్టం కలుగుతోంది. ఈ కారణం వల్ల సలార్ సెట్స్ లో షాకింగ్ రూల్స్ అమలులోకి రానున్నాయని సమాచారం అందుతోంది. ఇకపై ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా మేకర్స్ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి లీకులు జరగకూడదని ఎవరైనా సలార్ సినిమాకు సంబంధించి లీక్ చేస్తే చర్యలు తీసుకుంటామని మేకర్స్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇలాంటి లీక్స్ విషయంలో మేకర్స్ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. టెక్నీషియన్లు మొబైల్స్ ను సెట్ లోకి తీసుకొనిరాకూడదని సూచనలు చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు పని చేస్తున్న వాళ్లందరికీ ప్రశాంత్ నీల్ కూడా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కు మరో ఏడాది సమయం మాత్రమే ఉన్నా సినిమా రిలీజైతే ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం గ్యారంటీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సలార్ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు నటుడిగా ప్రభాస్ రేంజ్ పెరుగుతుండగా ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus