నయనతార – నెట్‌ఫ్లిక్స్ కలసి ప్రేక్షకులకు అందించిన డాక్యుమెంటరీ ‘బియాండ్ ది డ్రీమ్స్’. ప్రేక్షకులకు ఆ డ్రీమ్స్ ఎలా అనిపించాయో తెలియదు కానీ, ఆమెకు మాత్రం కలలోకి ఆ డాక్యుమెంటరీ వస్తూనే ఉంది. గతంలో ధనుష్ నుండి లీగల్ నోటీసులు అందుకున్న నయనతార.. ఇప్పుడు ‘చంద్రముఖి’ టీమ్ నుండి ఈ పరిస్థితి ఎదురైంది. ఆ డాక్యుమెంటరీలోని ‘చంద్రముఖి’ సన్నివేశాలు తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
నటి నయనతార, డైరక్టర్ విఘ్నేశ్ శివన్ వివాహ వేడుకలు, వారికి సంబంధించిన వీడియో రికార్డులను డార్క్ స్టూడియో ఓ డాక్యుమెంటరీగా రూపొందించిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీ చాలా ఏళ్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు 2024లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయింది. అందులోనే ‘చంద్రముఖి’ సినిమా సన్నివేశాలు ఉన్నాయి అనేది ఏబీ ఇంటర్నేషనల్స్ వాదన. ఈ మేరకు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరింది.
ఈ కేసును సోమవారం విచారించిన మద్రాసు హైకోర్టు రెండు వారాల్లో జవాబివ్వాలని డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్ స్టూడియో, నెట్‌ఫ్లిక్స్‌కు ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఈ విషయంలో ఆ రెండు సంస్థలు ఎలాంటి సమాధానం ఇస్తాయో చూడాలి. ఈ విషయంలో నయనతార రియాక్షన్ కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే గతంలో నటుడు ధనుష్‌తో ఇలాంటి వివాదమే నెలకొంది. ధనుష్‌కి చెందిన వండర్‌బార్ ఫిలిమ్స్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్’ షూటింగ్ సన్నివేశాలను డాక్యుమెంఒటరీ వాడినందుకు ఆయన కోర్టు మెట్లెక్కారు. ఆ ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.
ఈ నేపథ్యంలో ‘చంద్రముఖి’ సినిమా టీమ్ ఇలా నోటీసులు పంపడం గమనార్హం. గతంలో ధనుష మీద అంతెత్తున ఎగిరిన నయన్.. ఇప్పుడడు ‘చంద్రముఖి’ టీమ్ మీద ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ విషయంలో ఆమె తప్పని తేలితే రూ.5 కోట్లు చెల్లించాల్సిందే. అయితే అదెవరు చెల్లిస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరం.