Legend Collections: ‘లెజెండ్’ కి 11 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా ఫేడౌట్ అయిపోయారు అని అంతా అనుకుంటున్న టైం ‘సింహా’ అనే బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నారు బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ‘లెజెండ్’ (Legend) అనే పొలిటికల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ కూడా వచ్చింది. 2014 మార్చి 28న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్’ సంస్థ పై రామ్ ఆచంట (Ram Achanta), గోపీచంద్ ఆచంట (Gopichand Achanta), అనిల్ సుంకర (Anil Sunkara) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధికా ఆప్టే (Radhika Apte) , సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు.

Legend Collections:

ఈ చిత్రంతో సీనియర్ హీరో జగపతి బాబు (Jagapathi Babu) విలన్ గా మారారు.బాలయ్య – జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ఆడియన్స్ కి అమితంగా నచ్చేశాయి. నేటితో ఈ సినిమా విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.దీంతో ‘ #11YearsForBlockBusterLegend’ ‘Legend’ అనే హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 9.41 cr
సీడెడ్ 8.40 cr
ఉత్తరాంధ్ర 3.68 cr
ఈస్ట్ 2.25 cr
వెస్ట్ 2.21 cr
గుంటూరు 4.14 cr
కృష్ణా 2.30 cr
నెల్లూరు 1.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 34.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.75 cr
ఓవర్సీస్ 1.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 40.39 cr (షేర్

‘లెజెండ్’ (Legend) చిత్రం రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.40.39 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి ఈ సినిమా రూ.8.09 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఒకే రోజు రిలీజ్ అయిన ప్రభాస్, బన్నీ సినిమాలు..22 ఏళ్ళ క్రితం అలా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus