అల్లు అర్జున్ (Allu Arjun) , ప్రభాస్ (Prabhas) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని వారు షేర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో.. ప్రత్యక్షంగా చాలా సందర్భాల్లో బయటపడింది. ఇప్పుడు ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఛత్రపతి’ (Chatrapathi) ‘బాహుబలి’ (Baahubali) ‘బాహుబలి 2’ (Baahubali 2) వంటి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఇక సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చేసిన ‘ఆర్య’ (Aarya) ‘ఆర్య 2’ (Arya 2) ‘పుష్ప’ (Pushpa) ‘పుష్ప 2’ (Pushpa 2) వంటి సినిమాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
ప్రస్తుతం వీరు చేసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే రూపొందుతున్నాయి. అయితే ఈ ఇద్దరి పాన్ ఇండియా స్టార్స్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అనే సంగతి మీకు తెలుసా? కానీ ఇది నిజం. ఇది తెలుసుకోవాలంటే మనం 22 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అంటే 2003 కి అనమాట. ఆ ఏడాది అల్లు అర్జున్ ‘గంగోత్రి’ (Gangotri) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని అల్లు అరవింద్ (Allu Aravind), అశ్వినీదత్ (C. Aswani Dutt)..లు కలిసి నిర్మించారు. మార్చి 28న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ తర్వాత సమ్మర్ హాలిడేస్ మొదలవ్వడం. థియేటర్లలో గంగోత్రి నుండి తెచ్చిన గంగాజలం(నీళ్లు) ఇస్తున్నారని ప్రచారం చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించారు మేకర్స్. ఆ రకంగా ఆ సినిమా పాస్ మార్కులు వేయించుకుని బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేసింది.
అయితే అదే రోజున(మార్చి 28న) ప్రభాస్ హీరోగా సురేష్ కృష్ణ (Suresh Krishna) దర్శకత్వంలో ‘రాఘవేంద్ర’ (Raghavendra) కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కూడా అప్పట్లో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా.. సైలెంట్ గానే వెళ్ళిపోయింది. అలా అల్లు అర్జున్.. ప్రభాస్ పై పైచేయి సాధించడం జరిగింది.