Sr NTR: వెండి నాణెం మీద ఎన్టీఆర్ ఫోటో ముద్రణకు భారత ప్రభుత్వం నిర్ణయం.. ఎన్ని రూపాయల కాయిన్ అంటే..

ఒక మనిషి ఈ భూమ్మీద లేనప్పుడు కూడా ప్రతిరోజు, అనునిత్యం ఆ మనిషిని తల్చుకోవడమే అసలైన జీవితానికి అర్థం.. మహనీయులకు మరణం ఉండదు.. ఎల్లప్పుడూ ప్రజల మనసుల్లోనే ఉంటారు అంటుంటారు.. అటువంటి మహనీయుడు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న.. పద్మశ్రీ నందమూరి తారక రామారావు.. వెండితెర కథానాయకుడిగానే కాక.. తిరుగులేని ప్రజానాయకుడిగా చరిత్ర సృష్టించారాయన.. రాముడు, కృష్ణుడిగా పూజలందుకున్న ఎన్టీఆర్.. తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు.. మరణానంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..

పలుసార్లు పార్లమెంట్‌లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి కానీ ఇప్పటికీ ప్రకటించకపోవడం బాధాకరం.. అయితే 2023 ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఆ మహానుభావుడికి ఘన నివాళి అర్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. సినీ నటుడు, రాజకీయ నాయకుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు బొమ్మతో వంద రూపాయల నాణాన్ని ముద్రించనున్నారు.. అది కూడా పూర్తి వెండితో కావడం విశేషం.. మొత్తం వెండితో తయారు చేయబోయే నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే అందుకు తగ్గ పనులు ప్రారంభించారు..

ఈ నేపథ్యంలో కాయిన్ నమూనాను చూపించి.. సలహాలు, సూచనలు కోరడానికి ఎన్టీఆర్ కుమార్తెను దగ్గుబాటి పురంధరేశ్వరిని మింట్ అధికారులు హైదరాబాద్‌లో కలిశారు. నాణెం యొక్క డిజైన్, రామారావు గారి ఫోటో వంటి వివరాలను ఆమెకు చూపించారు.. మార్పులు, చేర్పుల తర్వాత పురంధరేశ్వరి ఫైనలైజ్ చేస్తారట.. శకపురుషుని శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. కేవలం ఎన్టీఆర్ అభిమానులకే కాదు..

తెలుగు వారందరికీ గర్వకారణం.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తారక రాముడి బొమ్మతో వెండి నాణెం ముద్రించ బోతున్నారనే వార్త.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. మే 28 ఎన్టీఆర్ శత జయంతి నాటికి ఈ వెండి కాయిన్స్ అందుబాటులోకి రానున్నాయి..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus