Dilip Kumar: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ కన్నుమూత!

  • July 7, 2021 / 08:58 AM IST

బాలీవుడ్‌లో దిగ్గజం దివికేగింది. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్‌ కుమార్‌ (98) కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ముంబయిలోని హిందుజ ఆసుపత్రిలో చేరిన దిలీప్‌ కుమార్‌… ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్‌ కుమార్‌ అసలు పేరు మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌. ఆయనకు బాంబే టాకీస్‌ యజమాని దిలీప్‌ కుమార్‌ అని పేరు మార్చారు. 1944లో ‘జ్వర్‌ ఖాతా’ చిత్రంలో సినీ రంగంలో ప్రవేశించిన ఆయన 1998 వరకు దిలీప్‌ కుమార్‌ చిత్రసీమను ఏలారు.

1955లో ‘దేవదాస్‌’తో ఆయనకు గుర్తింపు లభించింది. భారతీయ చిత్రసీమకు మెథడ్‌ యాక్టింగ్‌ టెక్నిక్‌ పరిచయం చేసిన నటుడు దిలీప్‌. 1955లో వచ్చిన ‘ఆజాద్‌’ఆ దశాబ్దంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సాధించింది. పౌరాణిక చిత్రం ‘మొఘల్‌ – ఎ- ఆజామ్‌’తో దిలీప్‌ కుమార్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘అందాజ్‌’, ‘ఆన్‌’, ‘డాగ్‌’, ‘గంగా జమున’, ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’ చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. 1998లో ఆఖరిగా ‘ఖిలా’లో నటించారు దిలీప్‌ కుమార్‌.

1992 డిసెంబరు 11న పాక్‌లోని పెషావర్‌లో దిలీప్‌ కుమార్‌ జన్మించారు. సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలసి దిలీప్‌ కుమార్ పండ్లు అమ్మారాయన. 1966లో సైరా భానును వివాహం చేసుకున్నారు. 1980లో ఆస్మాను రెండో వివాహం చేసుకున్నారు. ఉత్తమనటుడిగా ఎనిమిదిసార్లు ఫిలిం ఫేర్‌ పురస్కారం అందుకున్నారు. 1994లో కేంద్రం ఆయన్ను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. 1991లో పద్మభూషణ్‌, 2015లో దిలీప్‌కుమార్‌ను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించాయి. 1993లో దిలీప్‌కుమార్‌కు ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్ పురస్కారం అందించారు. 1998లో దిలీప్‌కు పాకిస్థాన్‌ ప్రభుతవం నిషాన్‌ – ఇ- ఇంతియాజ్‌ అవార్డుతో సత్కరించింది. 2000 నుండి 2006 వరకు దిలీప్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యుడగా సేవలందించారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus