సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,హాలీవుడ్ నటి లొరెట్టా స్విట్, తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్‌ టామ్‌ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను,నటి, మోడల్ అయిన షెఫాలీ జరీవాలా, దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, హుమైరా అస్గర్ అలీ, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా, కోటా శ్రీనివాసరావు వంటి ఎంతో మంది నటీనటులు మరణించారు.

Saroja Devi

ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… సీనియర్ నటి సరోజా దేవి మరణించారు. ఆమె వయసు 87 ఏళ్ళు. కొన్నాళ్ళ నుండి వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఈమె ఈరోజు ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తుంది. బెంగళూర్ లో ఉన్న ఆమె నివాసంలోనే సరోజా దేవి చివరి శ్వాస వదిలినట్టు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు.

సరోజా దేవి 1955 లో వచ్చిన ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ సినిమాతో ఆమె సినీ కెరీర్ ను ప్రారంభించింది. తెలుగులో అయితే ‘ఇంటికి దీపం ఇల్లాలే’ ‘అల్లుడు దిద్దిన కాపురం’ ‘దాగుడు మూతలు’ ‘దానవీర శూర కర్ణ’ ‘పండంటి కాపురం’ ‘మంచి చెడు’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 200 కి పైగా సినిమాల్లో నటించారు సరోజా దేవి. ఎన్టీఆర్,ఏఎన్నార్,ఎం.జి.ఆర్ వంటి స్టార్ హీరోల సరసన ఈమె హీరోయిన్ గా నటించడాన్ని విశేషంగా చెప్పుకోవాలి.

రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus