స్త్రీ జాతి కోసం ‘మహానటి’ సావిత్రి కథ!
- March 8, 2017 / 12:57 PM ISTByFilmy Focus
తెలుగు చిత్రపరిశ్రమలో మెరిసిన ఆణిముత్యం సావిత్రి. చక్కని అభినయంతో ఆమె తెలుగుజాతి గర్వించే నటి అయింది. తమిళీయులు కూడా సావిత్రి అంటే చాలా ఇష్టం. చివరి శ్వాస వరకు సినిమానే ధ్యాసగా బతికిన సావిత్రి జీవితంపై యువ దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను రూపొందించనున్నారు. “ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విమర్శకుల ప్రసంశలందుకున్న ఈ డైరక్టర్ సావిత్రి నిజ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. రెండేళ్లుగా ఆమె గురించి పరిశోధించి స్క్రిప్ట్ రెడీ చేసుకున్న అశ్విన్ త్వరలో షూటింగ్ కి వెళ్లనున్నారు. ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటించనుంది. క్యూట్ బ్యూటీ సమంత జర్నలిస్ట్ గా కనిపించనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ లుక్ ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు రిలీజ్ చేశారు. సావిత్రితో పాటు సమంత, కీర్తి సురేష్ ల మొహాలతో ఉన్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ మీద ‘తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ’ అని రాసి ఉన్న క్యాప్షన్ సినిమాపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














