బాయ్‌కాట్… ఇటీవల వరకు బాలీవుడ్‌లో ఈ మాట ఎక్కువగా వినిపించేది. ఏదో విషయం ఆ హీరో ఏదో అన్నాడని నెటిజన్లు, ఓ వర్గానికి చెందిన ప్రజలు ‘బాయ్‌కాట్’ పిలుపు ఇచ్చేవారు. అలా బాలీవుడ్‌లో చాలా సినిమాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడో, ఎక్కడో, ఏదో సందర్భంలో వచ్చిన మాటలు, చేష్టలు సినిమాల్ని ముంచేశాయి. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే బాలీవుడ్ మరచిపోతోంది. ఇటీవల కాలంలో ఆ సమస్య రావడం లేదు. అయితే ఇప్పుడు ఆ సెగ తమిళ సినిమా మీదకు వచ్చింది.
దళపతి విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘లియో’. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం అంటున్న ఆ సినిమా దసరా సందర్భంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ టీమ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటే ఓవైపు నుండి వాదన వినిపిస్తోంది. అయితే అది తమిళనాట కాదు… మలయాళ జనాల నుండి. దీంతో ఏమైందా అని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు.
#KeralaBoycottLEO అంటూ ఓ హ్యాష్ టాగ్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ట్రెండ్ అవుతోంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను, అందులోనూ లోకేశ్ కనగరాజ్ లాంటి దర్శకుడు నుండి, విజయ్ లాంటి హీరో నుండి వస్తున్న సినిమాను ఎందుకు బ్యాన్ అంటున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఆ క్రమంలో కేరళలో మోహన్ లాల్ అభిమానుల కొంతమంది, విజయ్ అభిమానులు కొందరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
గతంలో మోహన్ లాల్, విజయ్ కలసి ఓ సినిమా చేశారు. అదే ‘జిల్లా’. మామూలుగానే ఇండస్ట్రీలోకి ఇంకో హీరోతో పోల్చుకుంటూ కామెంట్స్ చేయం నెటిజన్లు అలవాటు. అలా ఆ సినిమాలో విజయ్ కంటే మోహన్‌లాల్ నటనే అదిరిపోయింది అని ఓ కామెంట్ చేశారు ఓ వ్యక్తి. అది విజయ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో ఎదురుదాడి మొదలెట్టారు. పాత సినిమాల్లో మోహన్ లాల్ నటనను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.
దీంతో లాలెటన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి… #KeralaBoycottLEO అనే హ్యాష్ ట్యాగ్ తీసుకొచ్చారు. అయితే ఇది జరుగుతుందా లేదా అనేది వేరే టాపిక్. కానీ ఇలాంటి చర్చలు ఇబ్బందికరం అని మరోసారి తేలింది.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!