లోకేశ్ కనగరాజ్ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో మనం చూశాం. అందుకే ఆయన సృష్టిస్తున్న లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ గురించి అందరూ అంతగా ఆసక్తిగా ఉన్నారు. అలా ఈ ప్రపంచంలో నుండి వచ్చిన ‘లియో’ గురించి కూడా వెయిట్ చేశారు. అయితే సినిమా ఫలితం మీద అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో కొన్ని మార్పులు అవసరం అని అందరితోపాటు లోకేశ్ కూడా అనుకున్నారు. అయితే ఈ సినిమాలో చూపించింది అంతా ఫేక్ అని ఇటీవల చెప్పారు.
దీంతో ఏంటీ… అంటూ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ‘లియో’ సినిమాలో చూపించిన ఫ్లాష్‌బ్యాక్ ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. పార్థిబన్ aka లియో గురించి తెలుసుకునే క్రమంలో జైలులో ఉన్న హిదయరాజ్ (మన్సూర్ అలీఖాన్)ను ఫారెస్ట్ ఆఫీసర్ ఆండ్రూస్ (గౌతమ్ వాసుదేవ్ మేనన్)కలిసినట్లు సినిమాలో చూపించారు. అప్పుడు హిదయరాజ్ నా దృష్టి కోణం నుండి లియో కథ ఇదీ అంటూ చెబుతాడు. అక్కడే హింట్ ఇచ్చిన లోకేశ్… ‘లియో’ అసలు జీవితం మరొకలా ఉంటుంది అంటూ దానికి క్లారిటీ ఇచ్చాడు.
అంతే హిదయరాజ్ చెప్పిందంతా నిజం కాదని… అసలు కథ వేరే ఉందని చెప్పారు లోకేశ్. అసలు కథ ఏంటి అనేది ‘లియో 2’ సినిమాలో చూపించే అవకాశం ఉందని లోకేశ్ అన్నారు. దీంతో ‘ఇదేం ట్విస్ట్ లోకేశూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే లోకేశ్ ఇప్పుడు ఇలా అనడం వెనుక వేరే కారణం ఉంది అని కూడా చెబుతున్నారు.
‘లియో’ (LEO Movie) ఫ్లాష్ బ్యాక్‌ను సరిగ్గా, బలంగా చూపించలేదు అనే విమర్శలు వచ్చాయి. వాటిని కంట్రోల్ చేయడానికి ఇలా అని ఉండొచ్చు అని కూడా అంటున్నారు. లియో తండ్రి ఆంటోనీ దాస్, బాబాయ్ హరోల్డ్ దాస్ పాత్రలను కూడా అంతగా పవర్‌ఫుల్‌గా చూపించలేదు. లియోకు బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పుడు… ‘లియో’ సినిమాలో చూపించకుండా ఇప్పుడు రెండో పార్టు అనడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో లోకేశ్ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.