కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘లియో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ‘లియో’ కి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి.
రెండో రోజు కూడా ఈ మూవీ చాలా బాగా హోల్డ్ చేసింది అని చెప్పాలి. ఒకసారి ‘లియో’ 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
6.39 cr
సీడెడ్
2.62 cr
ఉత్తరాంధ్ర
1.54 cr
ఈస్ట్
1.06 cr
వెస్ట్
0.68 cr
గుంటూరు
1.02 cr
కృష్ణా
0.85 cr
నెల్లూరు
0.55 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
14.71 cr
‘లియో’ (LEO) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.15.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.14.71 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఆదివారం కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.