LEO OTT: ఓటీటీ లవర్స్ కు భారీ షాకిచ్చిన నెట్ ఫ్లిక్స్.. ఏకంగా ఇన్ని ట్విస్టులా?

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమా ఎక్కువగా నెగిటివ్ కామెంట్ల ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా విడుదలై నెల రోజులు కావడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. అయితే ఈ నెల 21వ తేదీన లియో సినిమా డిజిటల్ రిలీజ్ అవుతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సినిమాల జాబితాలో ఉంది.

లియో సినిమా డిజిటల్ రిలీజ్ కు సంబంధించిన ప్రకటనతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషించారు. అయితే ఆ సంతోషం ఆవిరి కావడానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ నెల 21వ తేదీన స్ట్రీమింగ్ కానున్న లియో విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో కాదు. హాలీవుడ్ నటుడు అడమ్ శ్లాండర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో ఈ నెల 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

బల్లి, తాబేలు ఒక పాఠశాలలో చిక్కుకునే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ యానిమేషన్, హ్యాపీ మ్యాడిసన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. డిసెంబర్ నెలలో లియో ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది.

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబో మూవీ (LEO) లియో ఓటీటీ వెర్షన్ కొన్ని మార్పులతో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఓటీటీలో కూడా లియో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. లియో సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. లియో సీక్వెల్ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus