‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్టు వచ్చాక రాంచరణ్ లో ‘నేను నెంబర్ వన్ హీరో’ అనే ఫీలింగ్ చాలా కనిపించేది. ఆకాశమే హద్దు అన్నట్టు ఉండేది అతని వ్యవహార శైలి తరువాత ‘ఆరెంజ్’ ‘తుఫాన్’ ల దెబ్బకి నేల మీద పడ్డాడు. ‘రచ్చ’ ‘నాయక్’ ‘ఎవడు’ చిత్రాలు సీజన్లో వచ్చాయి కాబట్టి ఏదో ఆడాయి. కానీ ‘గోవిందుడు అందరివాడేలే’ ‘బ్రూస్ లీ’ వంటి ప్లాపులు చరణ్ కు గుణపాఠాలు నేర్పించాయి. దీంతో చాలా వరకూ తగ్గి ‘ధృవ’ చేసాడు. మంచి ఫలితం వచ్చింది. కానీ ఆ సినిమా హిట్టు గురించి ఎక్కువ భజన చేయలేదు. ‘రంగస్థలం’ చిత్రం నాన్ బాహుబలి గా నిలిచినా రికార్డుల స్థాయి గురించి మాట్లాడలేదు. ‘వినయ విధేయ రామా’ సినిమా డిజాస్టర్ అయినా దైర్యంగా ముందుకొచ్చి తనదే బాధ్యత అని చెప్పాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఇంతే..! కెరీర్ ఆరంభంలో ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి ఇండస్ట్రీ హిట్లు కొట్టాక నేనే నెంబర్ వన్ అనే బిల్డప్ ఇచ్చాడు. కానీ ‘ఆంధ్రావాలా’ చిత్రం నుండీ అట్టర్ ప్లాపులు పడ్డాక అతనిలో మెచ్యూరిటీ బాగా వచ్చింది. ‘టెంపర్’ దగ్గరనుండీ అతనికి ప్లాపులు లేవు. ఇప్పుడు తను మంచి సినిమా తీసాను అంటున్నాడు కానీ రికార్డులు కొట్టాను అనే డబ్బా మాత్రం కొట్టాడం లేదు.
అయితే మహేష్ మాత్రం వీరిద్దరికి బిన్నంగా ఉన్నాడు. ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ వచ్చాక మూడు డిజాస్టర్లు పడ్డాయి. ‘పోకిరి’ సక్సెస్ టైములో చేసిన హడావిడికి మూడేళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కానీ ‘దూకుడు’ ‘బిజినెస్ మెన్’ హిట్టవ్వగానే మళ్ళీ నేను నెంబర్ వన్ అంటూ హడావిడి మొదలుపెట్టాడు. మహేష్ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు అది కాదనలేము. కానీ ఇలా ప్రతీసారి నా సినిమా రికార్డులు కొట్టేసింది అని డబ్బా కొట్టుకోవడం మహేష్ అభిమానులు కూడా జీర్ణించుకోలేరు. ‘మహర్షి’ బాగానే ఆడుతుంది. మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మహేష్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్… కలెక్షన్ల పరంగా. అయితే ఈ చిత్రం ‘నాన్ బాహుబలి’ రికార్డులు అయినా ‘ఖైదీ నెంబర్ 150’ ‘రంగస్థలం’ రికార్డులని దాటలేదు. అదీ మహేష్ కు సోలో రిలీజ్ వచ్చి, టికెట్ రేట్లు పెంచి.. అందులోనూ సమ్మర్ లో రిలీజ్ చేసినప్పటికీ కూడా..! ఇక ఇందులో మహేష్ కాలర్ ఎగరేసేంత ఏముంది..? పవన్ కళ్యాణ్ తో సమానంగా మహేష్ క్రేజ్ ఉంది. ఒక దశలో పవన్ కళ్యాణ్ నే మించేలా ట్రై చేసాడు. ఇప్పుడు రికార్డుల కోసం తన రేంజ్ తగ్గించుకోవాలా..? ‘మహర్షి’ చిత్రంలో ఓ డైలాగ్ ఉంటుంది… ‘మనం డబ్బు కోసం పరిగెడితే.. అది మన కన్నా వేగంగా పరిగెడుతుంది, అదే డబ్బుని లెక్క చేయకుండా పరిగెడితే అది మన వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది’ అని.. మరి రియాలిటీలో మహేష్ కూడా రికార్డులని వదిలేసి పరిగెడితే చాలా మంచిది.