టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ‘లైగర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ లకు పర్మిషన్లు ఇస్తుండడంతో పూరి కూడా తన సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సౌత్ తో పాటు హిందీలో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొన్ని ఓటీటీ సంస్థలు ఈ సినిమాను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కుల కోసం రూ.200 కోట్లు ఆఫర్ చేసిందట. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సినిమాలకు ఈ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. కానీ ‘లైగర్’ పాన్ ఇండియా సబ్జెక్ట్ కావడంతో అన్ని భాషల్లో సినిమాకి మంచి రేటు పలికే ఛాన్స్ ఉంది.
అది దృష్టిలో పెట్టుకొని ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ కోసం రూ.200 కోట్లు ఆఫర్ చేశారట. కానీ దర్శకనిర్మాతలు మాత్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. థియేటర్లు తెరుచుకున్నా.. కూడా యాభై శాతం కెపాసిటీతో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ను సాధించగలమో లేదోననే సందేహాలు దర్సకనిర్మాతల్లో కూడా ఉన్నాయి. మరి ఓటీటీ డీల్ ను యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి!
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?