Liger Movie: రిలీజ్ కు ముందే ‘లైగర్’ కి అంత రేటు పలుకుతుందా?

  • July 26, 2022 / 05:46 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైగర్’. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. ప్రమోషన్లు కూడా ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ట్రైలర్‌ కూడా రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. అక్డీ పక్డీ అనే పాట కూడా చార్ట్ బస్టర్ అయ్యింది.

దీంతో ‘లైగర్’ కు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జరగని విధంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. అటు బాలీవుడ్ లో కానీ, ఇటు టాలీవుడ్ లో కానీ సరైన హిట్టు సినిమా పడి… ముఖ్యంగా జనాలను థియేటర్ కు తీసుకొచ్చే సినిమా పడి చాలా రోజులు అయ్యింది. ‘లైగర్’ సినిమా జనాలను థియేటర్ కు తీసుకొచ్చే సినిమా అవుతుంది అని అంతా నమ్ముతున్నారు.ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ‘లైగర్’…

నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వెనక్కి రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ , ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్.. ఇలా మొత్తం కలుపుకుని మొత్తం రూ. 55 కోట్ల నుండి రూ. 60 కోట్ల వరకు పలుకుతోంది. బాలీవుడ్‌ స్టార్ ప్రొడ్యూసర్ ‘ధర్మ ప్రొడక్షన్స్’ అధినేత అయిన

కరణ్‌ జోహార్‌, ‘పూరీ కనెక్ట్స్‌'(పూరి, ఛార్మి) బ్యానర్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించగా హీరో విజయ్ దేవరకొండకి తల్లిగా రమ్యకృష్ణ నటించింది. మైక్ టైసన్ కూడా ఈ మూవీలో నటించడం విశేషం.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus