Liger Movie: ‘లైగర్’ టీం తో చిరు, సల్మాన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో..!

  • August 1, 2022 / 06:09 PM IST

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే పాన్ ఇండియా చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మైక్ టైసన్ ఈ చిత్రంతో మొదటి సారి బిగ్ స్క్రీన్ పై కనిపించనున్నాడు.అకిడి పకిడి సాంగ్ కు అలాగే టైలర్ లకు విశేషాధారణ దక్కింది. ప్రస్తుతం ‘లైగర్’ టీం ముంబైలో ఉంది. బాలీవుడ్ ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు పూరి జగన్నాథ్.

అక్కడి మాల్స్ లో, లోకల్ ట్రైన్స్ లో కూడా విజయ్, అనన్యలను తెగ తిప్పేస్తున్నాడు పూరి. పనిలో పనిగా ‘గాడ్ ఫాదర్’ సెట్స్ కు కూడా వీళ్ళను తీసుకెళ్లాడు. ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్లో భాగంగా ముంబై చిరు, సల్మాన్‌ ఖాన్‌లపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన ఈ పాట చిత్రీకరణ పూర్తయినట్టు కూడా ‘గాడ్ ఫాదర్’ టీం వెల్లడించింది. ఇక ‘గాడ్ ఫాదర్’ సెట్స్ కు వెళ్లిన ‘లైగర్’ టీం చిరు, సల్మాన్ ల బ్లెస్సింగ్స్ ను తీసుకుంది.

‘లైగర్’ మూవీ సూపర్ హిట్ అవ్వాలని చిరు .. టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారట.వీరు కలిసి దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో పూరి జగన్నాథ్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరు పాత్రను పరిచయం చేసే జర్నలిస్ట్ గా పూరి.. కనిపించనున్నట్టు తెలుస్తుంది.

ఇక ‘లైగర్’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో(పూరి, ఛార్మీ లతో) కలిసి ‘ధర్మ ప్రొడక్షన్స్’ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus