Mike Tyson: మైక్ టైసన్‌ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన ‘లైగర్’ టీం..వీడియో వైరల్!

ఈరోజు మైక్ టైసన్ పుట్టినరోజు. 56ఏళ్ళ ఈ అమెరికన్ బాక్సర్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ టైటిల్ రోల్‌ పోషిస్తున్న ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండడం తో పాటు ఛార్మి, కరణ్ జోహార్ లతో కలిసి ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఉండగా ఈరోజు మైక్ పుట్టినరోజు కావడంతో లైగర్ టీం అతనికి చిన్నపాటి సర్ప్రైజ్ ఇచ్చింది.

కరణ్ జోహార్ నుండి మొదలుకొని, విజయ్ దేవరకొండ, ఛార్మీ, విష్ణు, అనన్య పాండే, పూరీ జగన్నాధ్ లు మైక్ టైసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేశారు. అలాగే సినిమా యూ.ఎస్ షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని మేకింగ్ విజువల్స్‌ను కూడా ఈ వీడియోలో చూపించారు. మైక్ టైసన్ కు సంబంధించిన పోర్షన్ మొత్తం యూ.ఎస్ లోనే చిత్రీకరించారు. మైక్ టైసన్ బయట ఎలా ఉంటారు అన్నది ఈ వీడియోలో చూపించింది ‘లైగర్’ టీం.

విజయ్‌ దేవరకొండని అతను ముద్దుపెట్టుకోవడం…. ఛార్మి అండ్ టీంతో ఉల్లాసంగా గడపడం వంటి విజువల్స్ కూడా ఇందులో మనం గమనించవచ్చు.ఇక ‘లైగర్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.తెలుగు, హిందీ తో పాటు తమిళ, కన్నడ,మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ ఆగస్టు 25న అంటే ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ కి విడుదల కానుంది.మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!


‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus