Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Like, Share & Subscribe Review: లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Like, Share & Subscribe Review: లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 4, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Like, Share & Subscribe Review: లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సంతోష్ శోభన్ (Hero)
  • ఫరియా అబ్దుల్లా (Heroine)
  • బ్రహ్మాజీ, సుదర్శన్, నరేన్ (Cast)
  • మేర్లపాక గాంధీ (Director)
  • వెంకట్ బోయనపల్లి (Producer)
  • ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల (Music)
  • ఎ వసంత్ (Cinematography)
  • Release Date : నవంబర్ 4th, 2022
  • నిహారిక ఎంటర్టైన్మెంట్ (Banner)

స్వర్గీయ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం “లైక్ షేర్ & సబ్ స్క్రైబ్”. జాతిరత్నాలు ఫేమ్ ఫారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. టీజర్ & ట్రైలర్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, సరికొత్త తరహా ప్రమోషన్స్ తో జనాల్లోకి వెళ్ళిన ఈ చిత్రం థియేటర్లలో వారిని ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ: గువ్వ విహారి అనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి ఎప్పటికైనా టాప్ యూట్యూబర్ అయిపోవాలని కలలు కంటూ ఉంటాడు విప్లవ్ (సంతోష్ శోభన్). ఆ అత్యాశతోనే డానియల్స్ (సుదర్శన్)తో కలిసి అరకు బయలుదేరతాడు. అక్కడ తనను ఇన్స్పైర్ చేసిన యూట్యూబర్ వసుధ వర్మ (ఫారియా)ను కలుస్తాడు. ఆమెకు తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు.

కట్ చేస్తే.. ఊహించని విధంగా ఓ పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు. అసలు ఏమిటా సమస్య? ఆ సమస్య నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు? అనేది “లైక్ షేర్ సబ్ స్క్రైబ్” కథాంశం.

నటీనటుల పనితీరు: హీరోహీరోయిన్ సమానంగా ఆకట్టుకున్న సందర్భాలు అరుదు. ఈ చిత్రం విషయంలో అది జరిగింది. సంతోష్ శోభన్ & ఫారియా అబ్ధుల్లా తమ నటనతో విశేషమైన రీతిలో ఆకట్టుకున్నారు. సంతోష్ శోభన్ బాడీ లాంగ్వేజ్ లోని చురుకు, ఫారియా ముఖంలో అమాయకత్వం వారు పోషించిన పాత్రలను విశేషంగా ఎలివేట్ చేశాయి. మరీ ముఖ్యంగా వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యింది.

బ్రహ్మాజీ సీరియస్ పాత్రలో మంచి కామెడీ పండించాడు. సుదర్శన్ ఎప్పట్లానే యాసతో నెట్టుకొచ్చేశాడు. మిగతా నటులు కామెడీతో అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: వసంత్ ఫోటోగ్రఫీ వర్క్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అరకు అందాలను బాగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా నైట్ షాట్స్ ను విజువలైజ్ చేసిన విధానం బాగుంది. ఫ్రేమ్స్ కూడా కొత్తగా ట్రై చేశాడు.

ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల పాటలు పర్వాలేదు. నేపధ్య సంగీతం మాత్రం సినిమా మూడ్ కానీ ఎమోషన్స్ ను కానీ ఎలివేట్ చేయలేకపోయింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమా బడ్జెట్ కు తగ్గట్లుగా ఉన్నాయి.

ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఒక షార్ట్ ఫిలిమ్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించాలనుకోవడం పెద్ద మైనస్. ఫస్టాఫ్ కామెడీతో ఆకట్టుకున్నా.. సెకండాఫ్ కి వచ్చేసరికి కథనాన్ని ఎలా నడిపించాలో తెలియక తాను తికమక పడి ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టాడు. కామెడీ పంచ్ లు బాగానే ఉన్నాయి కానీ.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: లీడ్ పెయిర్ యాక్టింగ్ & కెమిస్ట్రీ, కామెడీ సీన్స్ వర్కవుటయినప్పటికీ.. కథలో విషయం లేకపోవడం, స్క్రీన్ ప్లేలో పస లేకపోవడంతో “లైక్ షేర్ & సబ్ స్క్రైబ్” బిలో యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఇకనుంచైనా సంతోష్ శోభన్ కథలు కాస్త సీరియస్ గా వింటే సినిమాలు వర్కటవుతాయి.

రేటింగ్: 1.5/5

Click Here To Read In ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Like Share & Subscribe
  • #Santosh Shoban

Reviews

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gurram Paapi Reddy Review in Telugu: గుర్రం పాపిరెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: గుర్రం పాపిరెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

2 hours ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

3 hours ago
Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

3 hours ago
Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

3 hours ago
Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

3 hours ago

latest news

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

4 hours ago
King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

9 hours ago
Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

9 hours ago
Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version