Hero Nani,Balakrishna: బాలయ్యకు అంటే సుందరానికి ఉన్న లింక్ ఇదే!

Advertisement

న్యాచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10వ తేదీన రిలీజ్ కానుంది. జూన్ నెల 10వ తేదీ స్టార్ హీరో బాలకృష్ణ పుట్టినరోజు కావడం గమనార్హం. బాలయ్య బర్త్ డే రోజున నాని సినిమాను విడుదల చేస్తుండటంతో బాలయ్య అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. తాజాగా అంటే సుందరానికి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నాని సినిమాసినిమాకు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

Click Here To Watch

నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో నాని బాలయ్య అభిమానిగా కనిపించిన సంగతి తెలిసిందే. రైడ్ సినిమాలో బాలయ్య సాంగ్ అయిన దంచవే మేనత్తా కూతురా సాంగ్ ను నాని రీమిక్స్ చేశారు. బాలయ్య ఫ్యాక్టర్ నానికి బాగానే కలిసొచ్చింది. రైడ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి. అంటే సుందరానికి సినిమాలో నానికి జోడీగా నజ్రియా నజీమ్ నటించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా నాని కనిపించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అంటే సుందరానికి తెరకెక్కుతోంది. శ్యామ్ సింగరాయ్ తో నాని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. నాని వరుసగా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాని ఈ సినిమాతో పాటు దసరా సినిమాలో కూడా నటిస్తున్నారు. సినిమాసినిమాకు నానికి క్రేజ్ పెరుగుతోంది. మిడిల్ రేంజ్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో నాని కావడం గమనార్హం. వి, టక్ జగదీష్ సినిమాలు నిరాశపరిచిన నేపథ్యంలో కథల ఎంపికలో నాని జాగ్రత్తపడుతున్నారు.

రొటీన్ మూస కథలకు నో చెబుతూ వైవిద్యం ఉన్న కథలకు నాని ఓటేస్తున్నారు. హీరోయిన్ల ఎంపికలో కూడా న్యాచురల్ స్టార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news