రావణాసురుడు అంటే అలా ఉంటారు..సినిమాల్లో “రావణుడి” పాత్ర పోషించిన 10 యాక్టర్స్!

  • June 19, 2023 / 01:16 PM IST

రామాయణం భారతీయులకు ఎంత ముఖ్యమైన గ్రంథమో అందరికి తెలిసిందే. అందులోని ప్రతి భాగం నీతినే బోధిస్తుంది. ధర్మం ప్రకారం ఎలా నడుచుకోవాలో వివరిస్తుంది. అందులోని ఘట్టాలన్నీ ధర్మాచరణకు అద్దం పడతాయి. శ్రీ రాముడు మొదలుకొని ప్రతి వ్యక్తి ఎంతో కొంత ప్రభావాన్ని మనపై చూపిస్తారు. వేల సంవత్సరాలుగా రామాయణం మనలో భాగం అయిపొయింది ఇందులో రావణుడు విలన్ అయినప్పటికీ ఎన్నో సుగుణాలు కలవాడు. భక్తి ప్రపత్తులు కలవాడు. శివుడి కి రావణుడు కంటే భక్తుడెవరు లేరని చెపుతుంటారు.

అంతటి రావణుడు, ఒక్క స్త్రీ బలహీనత కారణం గానే విలన్ అవుతాడు. తపస్సులతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న రావణుడికి కూడా భక్తులున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, స్త్రీ లోలత్వం కారణం గా శ్రీ రాముడి చేతిలో హతమయ్యాడు.

ఇప్పుడు వెండితెరపై రావణుడి పాత్రలో కనిపించి మెప్పించిన నటులెవరో చూద్దాం..

1) ఎన్టీఆర్

శ్రీరామ పట్టాభిషేకం’, ‘సీతారామ కళ్యాణం’ చిత్రం సహా అనేక చిత్రాల్లో రావణుడిగా నటించి మెప్పించారు ఎన్టీఆర్.

2) ఎస్వి రంగారావు

సంపూర్ణ రామాయణం మూవీ లో ఎస్వి రంగారావు రావణుడిగా నటించి మెప్పించారు.

3) అశుతోష్ రాణా

రామాయణ: ది ఎపిక్ మూవీ లో అశుతోష్ రాణా రావణుడిగా నటించారు.

4) కైకాల సత్యనారాయణ

బాపు గారు తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘సీతా కళ్యాణం’ లో రావణుడిగా కైకాల సత్యనారాయణ నటించారు.

5) స్వాతి

1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్, సీతగా స్మితా మాధవ్ నటించారు. ఇక రావణుడిగా స్వాతి బాలినేని అనే బాలిక నటించింది.

6) అరవింద్ త్రివేది

అప్పట్లో వచ్చిన ‘రామాయణ’ సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం సంపాదించారు అరవింద్ త్రివేది.

7) రాజ్ కుమార్

కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ భూ కైలాస్ చిత్రం లో రావణుడిగా నటించారు.

8) నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు శ్రీ రామదాసు మూవీ లో కాసేపు రావణుడిగా కనిపించారు.

9) ఓం పురి

భారత్ ఏక్ ఖోజ్ మూవీ లో ఓం పురి రావణుడిగా నటించారు.

10) సైఫ్ అలీఖాన్

ప్రభాస్ రాముడిగా రాబోతున్న ఆదిపురుష్ మూవీ లో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు.

ఇలా ఈ నటులు రావణుడిగా నటించి మనల్ని మెప్పించారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus