టీవీలు కూడా లేని రోజుల్లో జనాలు థియేటర్లకు ఎక్కువ వెళ్లేవారు. వినోదం అంటే అందరికీ అప్పట్లో సినిమా ఒక్కటే అన్నట్టుగా ఉండేది. కొంచెం కాలం గడిచాక టీవీలు వచ్చాయి. అయినా జనాలు థియేటర్ కు వెళ్లడం తగ్గించలేదు. వాటి ప్రాముఖ్యత వాటికి ఇచ్చేవారు. మళ్ళీ కొంత కాలానికి వి.సి.ఆర్ లు.. అటు కొంత కాలం తర్వాత వి.సి.డి లు వంటివి వచ్చాయి. పైరసీ ఎఫెక్ట్ ఎంత పడినా సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించేది కాదు. క్లారిటీ కోసం జనాలు థియేటర్లకు వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఓటీటీలు ఎంటరయ్యాయో అప్పటి నుండి వాటికి ప్రాముఖ్యత పెరిగింది. ఫలితంగా జనాలు థియేటర్ కు వెళ్లడం తగ్గించారు.
ఇది పెద్ద సినిమాలకు మైనస్ అయినట్టు కనిపించినా ఇంకో విధంగా ప్లస్ అయ్యింది కూడా..! ఎందుకంటే ఓటీటీల వల్ల నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు చాలా వరకు పెట్టుబడులు వెనక్కి వస్తుంది. తెలిసిన క్యాస్టింగ్ ఉంటే చాలు ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి మరీ సినిమాల హక్కులను దక్కించుకుంటున్నాయి. ఒకటి కాదు రెండు మూడు ఓటీటీ సంస్థలు కాస్త క్రేజ్ ఉన్న సినిమాలను వెంటనే కొనుగోలు చేస్తున్నాయి. ఈ లిస్ట్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ ‘భీమ్లా నాయక్’ మాత్రమే కాదు ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కృష్ణ అండ్ హిజ్ లీల :
సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ మూవీలో షాలిని వడ్నికట్టి, శ్రద్దా శ్రీనాథ్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్ ను అందుకుంది. ఈ మూవీ ‘ఆహా’ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
2) ఆర్.ఆర్.ఆర్ :
ఎన్టీఆర్- రాంచరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ నెట్ ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతుంది.
3) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ఆహా, హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ ఈ మూవీ మంచి ఫలితాన్ని అందుకుంది.
4) క్రేజీ ఫెలో :
ఆది సాయి కుమార్ హీరోగా దిగంగన సూర్యవంశీ, మిర్నా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఆహా తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
5) నేను మీకు బాగా కావాల్సినవాడిని :
కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ‘ఆహా’ లోనే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
6) సీతా రామం :
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
7)18 పేజెస్ :
నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ తో పాటు ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
8) ముఖ చిత్రం :
వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ లు.. హీరో హీరోయిన్లుగా విశ్వక్ సేన్ , బొమ్మాళి రవి శంకర్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘ఆహా’ లోనే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
9) హంట్ :
సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే కాకుండా ‘ఆహా’ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
10) గాలోడు :
సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 17 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే కాకుండా ‘ఆహా’ లో కూడా స్ట్రీమింగ్ కానుంది.