ఈ సినిమాలు చేసుంటే అనుపమ కెరీర్ మరోలా ఉండేదేమో..!

త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అఆ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ చిత్రంలో వల్లి పాత్రలో కాస్త కన్నింగ్ గా కనిపించినప్పటికీ… కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తరువాత ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ దర్శకనిర్మాతలను కూడా ఆకట్టుకుంది. వరుసగా రామ్,సాయి తేజ్, నాని వంటి క్రేజీ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ.. 2019 లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ చిత్రం తరువాత మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

అయితే అంత ట్యాలెంట్ ఉన్నప్పటికీ అనుపమ ఎందుకు స్టార్ హీరోయిన్ కాలేకపోయింది అంటే ఆమె వదులుకున్న సినిమాలే కారణమంటున్నాయి సినీ వర్గాలు. రాంచరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఈ బ్యూటీ పక్కన పెట్టేసిందట. లేదంటే ఈమె ఎప్పుడో స్టార్ హీరోయిన్ అయిపోయేదని కొందరి అభిప్రాయం. సరే ఈ రోజు అనుపమ పుట్టినరోజు కావడంతో అనుపమ రిజెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1)నేను లోకల్

2)మహానుభావుడు

3)రంగస్థలం

4) ఛల్ మోహన్ రంగ

5) అరవింద సమేత(ఇషా రెబ్బా పాత్ర)

6)ఎన్టీఆర్ కథానాయకుడు

7) ఇస్మార్ట్ శంకర్( నభా నటేష్ పాత్ర)

8)అర్జున్ సురవరం

9)వి(అథితి రావు హైదరి పాత్ర)

10) నిశ్శబ్దం(షాలినీ పాండె పాత్ర)

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus