RRR Movie: మరో అవార్డ్ అందుకున్న రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ కి ఇప్పటివరకు ఎన్ని అవార్డులు వచ్చాయంటే..?

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ‘ట్రిపులార్’ రిలీజ్ అయ్యి 8 నెలలవుతున్నా ఇంకా అదే జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.. ఇటీవల హాలీవుడ్‌‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజమౌళి.. ఇప్పటికే పలు ప్రశంసలు, పురస్కారాలు పొందుకున్నజక్కన్నకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఈ సినిమాకి ఏ ఏ కేటగిరీల్లో ఎలాంటి, ఎన్ని అవార్డులు వచ్చాయో చూద్దాం..

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్..

అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ మరో అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (Hollywood Critics Association) నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ అందుకుంది. RRR కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు ‘‘స్పాట్ లైట్ విన్నర్’’ అవార్డు వచ్చింది. దీంతో మరోసారి దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినీ ప్రముఖుల, అభిమానులు ప్రశంసలందుకుంటున్నారు.

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్..

పాపులర్ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ సారి బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళికి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు NYFCC తెలిపింది. ఎంతో మంది హాలీవుడ్ డైరెక్టర్లను తలదన్ని జక్కన్న ఈ ఘనత సాధించడం విశేషం..

శాటన్ అవార్డ్స్..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు పట్టం కడుతూ.. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం’ కేటగిరీలో శాటన్ అవార్డ్ (50th Saturn Awards – 2022) అనౌన్స్ చేశారు..

అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్..

‘బెస్ట్ ఇంటర్నేషనల్’ సినిమాగా అవార్డు అందుకున్న ట్రిపులార్ మూవీకి అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ కూడా అదే విభాగంలో అవార్డు ఇవ్వడం విశేషం..

సన్ నెట్ సర్కిల్..

నాలుగు హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి.. ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం’ గా నిలిచింది రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus