కోవిడ్ లాక్ డౌన్ తరువాత రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అని మీకు తెలుసా? ‘అరేయ్ బుర్ర తక్కువ వెదవ’… ‘ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాని పట్టుకుని ఇప్పుడు రిలీజ్ అయ్యింది అంటావేంట్రా?’ అని కోప్పడకండి..! లాక్ డౌన్ తరువాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమా రిలీజ్ అయ్యింది ఇండియాలో కాదు జపాన్ లో..! అవును అక్కడ ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కానీ రిజల్ట్ లో మాత్రం మార్పు లేదు. సేమ్ 2 సేమ్..! అక్కడ కూడ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ చేస్తుంది. అసల మన సినిమాలకు కూడా జపాన్ లో అంత క్రేజ్ ఉందా? మన ఇండియన్ సినిమాలకు జపాన్ లో అంత క్రేజ్ ఏర్పడేలా చేసిన హీరో ఎవరు అని ఆరా తీస్తే..! ఇంకెవరు మన తలైవా రజినీ కాంత్ అని తెలిసింది. అవును రజినీకాంత్ గారి వల్లే జపాన్లో మన ఇండియన్ సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. ఆయనతో పాటు మరికొంత మంది హీరోలు కూడా అక్కడ సత్తా చాటారు. వాళ్ళెవరు? ఆ సినిమాలేంటి? ఓ లుక్కేద్దాం రండి :
1) రజినీ కాంత్ : ముత్తు
‘ముత్తు’ తో ఇండియన్ సినిమాకి అక్కడ మార్కెట్ ఏర్పడింది. ముఖ్యంగా రజినీకాంత్ గారి సినిమాలకి అక్కడ డిమాండ్ బాగా ఎక్కువ.
2) ఎన్టీఆర్ : బాద్ షా
రజినీ కాంత్ గారి తరువాత జపాన్ లో సత్తా చాటింది మన తారకే..! అవును ‘బాద్ షా’ చిత్రంతో జపాన్ లో రచ్చ రచ్చ చేసి మన తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది చూపించాడు. అక్కడ తారక్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మన తారక్ సినిమాల్లోని పాటలకు అక్కడి జనాలు డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేసాయి కూడా..!
3) ప్రభాస్ : బాహుబలి
రజినీకాంత్ గారు ‘ముత్తు’ తో జపాన్ లో నెలకొల్పిన రికార్డులను ప్రభాస్ ‘బాహుబలి’ తో బ్రేక్ చేసాడు. మన ప్రభాస్ కటౌట్ కి ఫిదా అయిపోయారు అక్కడి జనాలు.
4) రాంచరణ్ : మగథీర
‘బాహుబలి’ మేనియాలో రిలీజ్ అవ్వడంతో ‘మగథీర’ కు కూడా జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
5) ప్రభాస్ : సాహో
‘బాహుబలి’ తో మాత్రమే కాదు ‘సాహో’ తో కూడా జపాన్ బాక్సాఫీస్ ను షేక్ చేసాడు ప్రభాస్.