‘బాహుబలి’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ .. వంటి చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసాయి. దీంతో తెలుగులో మార్కెట్ పెంచుకోవాలి లేదా ఏర్పరుచుకోవాలి అని మిగతా భాషల్లోని హీరోలు, దర్శకులు తెగ ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో తమిళ హీరోలు, దర్శకులు కాస్త ముందున్నారనే చెప్పాలి. తెలుగులో సినిమా చేసే ఛాన్స్ ఉంది అంటే వెంటనే ఫ్లైట్ ఎక్కి వాలిపోతున్నారు. తమిళ హీరోలు, డైరెక్టర్లు తెలుగులో సినిమాలు చేయాలని పరి తపిస్తున్నారు. అందుకోసం ఆల్రెడీ మన టాలీవుడ్ హీరోలను, డైరెక్టర్లను లైన్ లో పెట్టేసారు కూడా. ఈ తెలుగు- తమిళ కాంబినేషన్లు.. అంటే హీరో తెలుగైతే.. డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తెలుగైతే… హీరో తమిళ్.. ఇలాంటి కాంబినేషన్స్ లో రూపొందుతున్న 10 సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) రామ్ – లింగుస్వామి :
ఈ కాంబినేషన్ లో ‘ది వారియర్’ అనే ద్విభాషా చిత్రం రూపొందింది.తెలుగు హీరో రామ్.. తమిళ లింగుస్వామి కాంబినేషన్ అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ ఏకకాలంలో జూలై 14న విడుదల కానుంది.
2) రాంచరణ్ – శంకర్ :
టైటిల్ ఇంకా పెట్టలేదు కానీ, మన టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ తో తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ఇది. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
3) విజయ్ – వంశీ పైడిపల్లి :
తమిళ స్టార్ హీరో విజయ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ‘వారసుడు'(తమిళంలో వరిసు) అనే ద్విభాషా చిత్రం రూపొందుతోంది.ఈ సినిమా పై కూడా మంచి హైప్ నెలకొంది.
4) ధనుష్- వెంకీ అట్లూరి :
టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి… తమిళ స్టార్ హీరో ధనుష్ తో చేస్తున్న బై లింగ్యువల్ మూవీ ‘సర్’. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
5) శివకార్తికేయన్ – కె.వి.అనుదీప్ :
టాలీవుడ్ డైరెక్టర్ ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్..కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో చేస్తున్న బై లింగ్యువల్ మూవీ ‘ప్రిన్స్’ . ఈ చిత్రం పై కూడా సూపర్ క్రేజ్ నెలకొంది.
6) నాగ చైతన్య – వెంకట్ ప్రభు :
టాలీవుడ్ హీరో నాగ చైతన్య.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో ఓ బై లింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. కానీ దీని టైటిల్ ఏంటి అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైంది.
7) రవితేజ – శరత్ మండవ :
తెలుగువాడే అయినప్పటికీ తమిళ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించాడు దర్శకుడు శరత్ మండవ. అతను రవితేజ తో చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 29న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
8) ధనుష్ – శేఖర్ కమ్ముల :
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ బై లింగ్యువల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
9) చిరంజీవి – మోహన్ రాజా :
తమిళ దర్శకుడు మోహన్ రాజా.. చిరంజీవి తో ‘గాడ్ ఫాదర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
10) పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ – సముద్రఖని :
తెలుగు ప్రేక్షకులకు సముద్రఖని ఎక్కువగా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు. కానీ ఇతనే గతంలో రవితేజతో ‘శంభో శివ శంభో’, నాని తో ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు.తమిళంలో చాలా సినిమాలను డైరెక్ట్ చేశాడు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లతో ‘వినోదయ సీతమ్’ ను రీమేక్ చేస్తున్నాడు.
11) అర్జున్- విశ్వక్ సేన్ :
మాస్ క దాస్ విశ్వక్ సేన్ హీరోగా… సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.తమిళంలో, కన్నడ లో అర్జున్ చాలా చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక అర్జున్- విశ్వక్ సేన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తుంది.