మన టాలీవుడ్ దర్శకులు ఓ కథని రాసుకోవడం, దానిని పట్టుకుని ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరుగడం మామూలు విషయమే. ఆ కథ ఏ నిర్మాతకి నచ్చితే, ఆ నిర్మాత ఆ కథని సెట్స్ పైకి తీసుకెళ్తాడు. లేదంటే ఇక అంతే సంగతులు. ఇంకో పద్ధతి కూడా ఉంది. కొన్ని కథల్ని దర్శకులు హీరోలని దృష్టిలో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారు. ఆ హీరోలని సంప్రదించి ఆ కథల్ని వినిపిస్తారు. ఆ హీరోలకి దర్శకులు వినిపించిన కథలు నచ్చితే ఓకె, లేదంటే ఆ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం కష్టం. ఒకవేళ నచ్చితే ఆ ప్రాజెక్టుని ఎలాగోలా ఓకె చేసేస్తుంటారు హీరోలు. సో ఓ కథ ఒక్క హీరో దగ్గరే ఓకె అయిపోతుంది అనుకోవడం భ్రమ.ఏ కథైనా చాలా మంది హీరోల వద్దకి వెళ్లి వస్తుంటుంది. సో దర్శకులకి ఏ హీరోతో తమ ప్రాజెక్టు సెట్ అవుతుందో కచ్చితంగా చెప్పలేము.దీనికి ఉదాహరణగా కొంతమంది దర్శకులను చెప్పుకోవచ్చు. వాళ్ళలో కొంతమంది ఓ హీరో కోసం కథని రెడీ చేసుకుని.. వాళ్ళతో వర్కౌట్ అవ్వక చివరికి దొరికిన వాళ్ళతో చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) పుష్ప :
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు చేయాల్సింది. కానీ అతను చేయలేకపోయాడు. అందుకే అల్లు అర్జున్ తో చేసాడు సుకుమార్. పార్ట్ 2 అయిన ‘పుష్ప ది రూల్’ ను కూడా అల్లు అర్జున్ తోనే చేస్తున్నాడు.
2) జన గణ మన :
దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ ప్రాజెక్టుని మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ మహేష్ కు ఈ కథ నచ్చలేదు. ఆ తర్వాత పూరి చాలా మంది దర్శకుల వద్దకి తిరిగి చివరికి విజయ్ దేవరకొండని ఓకె చేసాడు.
3) పక్కా కమర్షియల్ :
దర్శకుడు మారుతీ మాస్ మహారాజ్ రవితేజ కోసం రెడీ చేసుకున్న కథ ఇది. కానీ అతను నో చెప్పేసరికి గోపీచంద్ తో చేస్తున్నాడు.
4) ధమాకా :
దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రాన్ని మొదట వెంకటేష్ తో చేయాలనుకున్నాడు. కానీ వెంకీ తప్పుకోవడంతో మాస్ మహారాజ్ రవితేజతో చేస్తున్నాడు.
5) సర్కారు వారి పాట :
దర్శకుడు పరశురామ్ మొదట ఈ కథని అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు. కథ కూడా వినిపించాడు. కానీ చివరికి మహేష్ ఛాన్స్ ఇవ్వడంతో అతనితో చేస్తున్నాడు.
6) భోళా శంకర్ :
‘వేదాళం’ రీమేక్ ను చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని చూసారు. కానీ ఇప్పుడు చిరుతో మెహర్ రమేష్ చేస్తున్నాడు.
7) ఏజెంట్ :
దర్శకుడు సురేందర్ రెడ్డి మొదట ఈ కథని చరణ్ కు వినిపించాడు. కానీ అఖిల్ ఫైనల్ అయ్యాడు.
8) టైగర్ నాగేశ్వర రావు :
దర్శకుడు వంశీ మొదట ఈ కథని మెగాస్టార్ చిరంజీవికి వినిపించారు. కానీ ఆయన బిజీగా ఉండడంతో రవితేజతో చేస్తున్నారు
9) రామ్- బోయపాటి :
రామ్- బోయపాటి కాంబోలో ఓ సినిమా రూపొందనుంది. ఈ కథని మొదట అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు బోయపాటి. కానీ రామ్ తో ముందుకెళ్తున్నాడు.
10) విజయ్- వంశీ పైడిపల్లి ప్రాజెక్టు :
దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మొదట మహేష్ తో అనుకున్నారు. కానీ మహేష్ కు ఇది సెట్ అవ్వదని భావించి విజయ్ ను ఒప్పించారు.
11) ఆచార్య :
చిరు పాత్రకి కాకుండా చరణ్ పాత్రకి మొదట మహేష్ బాబుని అనుకున్నారు. కానీ చివరికి చరణ్ నే ఫైనల్ చేసాడు దర్శకుడు కొరటాల శివ.
12) ఎన్టీఆర్ – కొరటాల :
ఎన్టీఆర్ – కొరటాల ప్రాజెక్టు.. దీనికి మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అనుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. కానీ బన్నీని తప్పించి ఎన్టీఆర్ తో చేస్తున్నాడు.
గతంలో కూడా దర్శకులు ఇలా ఒక హీరోతో అనుకుని మరో హీరోతో చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని హిట్ అయ్యాయి. మరికొన్ని ప్లాప్ అయ్యాయి.