రీమేక్ అంటే సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటారు. ఓ హిట్టు సినిమాని రీమేక్ చేస్తే కచ్చితంగా హిట్టు గ్యారెంటీ అని అంతా భావిస్తారు. అందుకే నిర్మాతలు కూడా పరభాషా చిత్రాల రీమేక్ హక్కులని భారీ రేటు చెల్లించి మరీ కొనుగోలు చేస్తుంటారు. అయితే అవన్నీ అపోహలే అని చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. రీమేక్ అంటే కథ రెడీగా ఉంటుంది. కానీ దానిని వేరే భాషలో తెరకెక్కిస్తున్నప్పుడు అందులో ఉన్న సోల్ ను మిస్ అవ్వకుండా నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించాల్సి ఉంటుంది. స్ట్రైట్ సినిమా తీసి ప్లాప్ అయితే ఒక రకంగానే విమర్శిస్తారు. అదే రీమేక్ ను తెరకెక్కించి ప్లాప్ ను మూటకట్టుకుంటే రెండు రకాలుగా కూడా మేకర్స్ విమర్శలపాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ఇదిలా ఉండగా.. తెలుగులో సూపర్ హిట్ అయిన ఓ 15 సినిమాలను తమిళంలో రీమేక్ చేయగా అవి ప్లాప్ లుగా మిగిలాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) స్టూడెంట్ నెంబర్ 1 :
తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తమిళంలో అదే పేరుతో శిబిరాజ్ హీరోగా రీమేక్ అయ్యింది. అక్కడ ఈ సినిమా ఘోరంగా ప్లాప్ అయ్యింది.
2) ఆది :
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తమిళంలో ప్రశాంత్ హీరోగా ‘జై హీరో’ పేరుతో రూపొందింది. కానీ అక్కడి నేటివిటీకి ఈ సినిమా సెట్ అవ్వలేక ప్లాప్ అయ్యింది.
3) దిల్ :
శింబు హీరోగా ‘కుత్తు’ పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
4) ఆర్య :
ధనుష్ హీరోగా ‘కుట్టి’ పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను అలరించలేకపోయింది.
5) అతనొక్కడే :
విజయ్ హీరోగా ‘ఆది హీరో’ పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.
6) సింహాద్రి :
విజయ్ కాంత్ హీరోగా రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ డిజాస్టర్ అయ్యింది.
7) లక్ష్యం :
అరుణ్ విజయ్ హీరోగా ‘మాంజా వేలు’ పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రం అక్కడ పెద్ద ప్లాప్ గా మిగిలింది.
8) కిక్ :
‘జయం’ రవి హీరోగా ‘తిల్లాలంగిడి’ పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ ప్లాప్.
9) లౌక్యం :
సంతానం హీరోగా ‘సక్క పోదు పోదు రాజా’ పేరుతో రీమేక్ అయిన ఈ చిత్రం కూడా అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
10) శౌర్యం :
తెలుగులో హిట్ అయిన ఈ చిత్రం అక్కడ విశాల్ హీరోగా ‘వేడి’ పేరుతో రీమేక్ అయ్యింది. కానీ అక్కడ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు.
11) అలా మొదలైంది :
సీనియర్ హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోగా రీమేక్ అయిన ఈ లవ్ స్టోరీ కూడా అక్కడి ప్రేక్షకులను అలరించలేకపోయింది.
12) జులాయి :
‘సాహసం’ పేరుతో ప్రశాంత్ హీరోగా అక్కడ రీమేక్ అయ్యింది. సినిమా అక్కడ పెద్ద ప్లాప్.. అంతే..!
13) ఇష్క్ :
‘ఉయిరే ఉయిరే’ పేరుతో సిద్దు హీరోగా రీమేక్ అయ్యింది. అక్కడ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది.
14) 100% లవ్ :
‘100% కాదల్’ పేరుతో జీవి ప్రకాష్ హీరోగా అక్కడ రీమేక్ అయ్యింది. అక్కడ ఈ మూవీ ప్లాప్ అయ్యింది.
15) అత్తారింటికి దారేది :
‘వంత రాజవతాన్ వరువాన్’ పేరుతో శింబు హీరోగా రీమేక్ అవ్వగా అక్కడ పెద్ద డిజాస్టర్ అయ్యింది.