కేంద్ర ప్రభుత్వం అన్- లాక్ ను మొదలుపెట్టి.. జనాలు బయటకు తిరగొచ్చు అని ఫ్రీడమ్ ఇచ్చేసినప్పటికీ .. థియేటర్లు ఇంకా తెరుచుకోకపోవడం.. పైగా ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరుగుతుండడంతో జనాలు ఇంకా ఇళ్ల పట్టునే ఉంటూ జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ క్రమంలో టీవీల్లో ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సినిమాలను కూడా ఎగబడి చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో గత వారం టీవీల్లో టెలికాస్ట్ అయిన సినిమాలకు కూడా అద్భుతమైన టి.ఆర్.పి రేటింగ్లు నమోదయ్యాయి. ఆ లిస్ట్ ప్రకారం అత్యధిక టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసిన సినిమా ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) మహర్షి:
7వ సారి టెలికాస్ట్ చేసినప్పటికీ మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం 7.14 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసి టాప్ ప్లేస్లో నిలిచింది.
2) మనసున్నోడు:
డబ్బింగ్ సినిమా అయినప్పటికీ శివకార్తికేయన్ ‘మనసున్నోడు’ ను మొదటిసారి టెలికాస్ట్ చెయ్యగా 4.65 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. అంతేకాదు టాప్ 2 ప్లేస్ ను దక్కించుకోవడం విశేషం.
3) జై లవ కుశ:
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో అలరించిన ‘జై లవ కుశ’ చిత్రాన్ని కూడా గత వారం టెలికాస్ట్ చెయ్యగా 4.52 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చెయ్యడం విశేషం.
4) ఐ:
మూడవ సారి కూడా విక్రమ్ ‘ఐ’ చిత్రం టీవీల్లో బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఈ గత వారం టెలికాస్ట్ అయిన ఈ చిత్రం 4.22 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
5) రోబో:
రజినీకాంత్- శంకర్ ల ‘రోబో’ చిత్రం కూడా గత వారం 3.96 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదుచేసింది.
6) భరత్ అనే నేను:
మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రం కూడా 2.88 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
7) నరసింహ నాయుడు:
బాలకృష్ణ – బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ‘నరసింహ నాయుడు’ చిత్రం కూడా గత వారం 2.87 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చెయ్యడం విశేషం.
8) కిక్:
రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం హిట్ మూవీ ‘కిక్’ కూడా 2.66 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
9) గీత గోవిందం:
విజయ్ దేవరకొండ – రష్మిక మందన కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘గీత గోవిందం’ కూడా 2.52 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
10) రాజు గారి గది 3:
ఓంకార్ డైరెక్షన్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘రాజు గారి గది3’ కూడా గత వారం టెలికాస్ట్ అయినప్పుడు 2.43 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.