నందమూరి తారకరత్న మరణం నందమూరి-నారా కుటుంబాలనే కాదు యావత్ సినీ పరిశ్రమను షాక్ కు గురిచేసింది. జనవరి 27న కుప్పంలో టీడీపీ నేత నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. 23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందినా లాభం లేకుండా పోయింది. తారకరత్న ట్రీట్మెంట్ కు నందమూరి – నారా ఫ్యామిలీ కలిసి రూ.8 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వినికిడి.
అంత పెట్టినా తారకరత్న ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఇక తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించేందుకు అతని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతా హాజరయ్యారు. ఈ క్రమంలో నిర్వహించిన తారకరత్న అంత్యక్రియలకు ఒకప్పటి హీరో హాజరయ్యాడు. అతను మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. సీనియర్ ఎన్టీఆర్ కు తమ్ముడు అయిన త్రివిక్రమరావు పెద్ద కొడుకే ఈ కళ్యాణ్ చక్రవర్తి. పెద్ద ఎన్టీఆర్ రిఫరెన్స్ తో ఇతను కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
మంచి అందగాడే ఇతను. ‘అత్తగారు స్వాగతం’, ‘అక్షింతలు’, ‘అత్తగారు జిందాబాద్’, ‘ఇంటి దొంగ’, ‘మామ కోడళ్ల సవాల్’, ‘కృష్ణ లీల’, ‘రౌడీ బాబాయ్’ ,’దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’, ‘తలంబ్రాలు’, ‘ప్రేమ కిరీటం’, ‘జీవన గంగ’ వంటి సినిమాల్లో ఇతను నటించాడు.అయితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు.
చివరిగా ఇతను 2003లో వచ్చిన కబీర్ దాస్ అనే సినిమాలో కనిపించాడు. తారకరత్న అంత్య క్రియల్లో ఇతన్ని చూసి చాలా మంది షాక్ కు గురయ్యారు. గుర్తుపట్టలేని విధంగా ఇతను మారిపోయాడు.