Tollywood Sequels: ‘పుష్ప 2’ తో పాటు తెలుగులో హిట్ అయిన 10 సీక్వెల్స్ లిస్ట్!

తెలుగులో (Tollywood) సీక్వెల్స్ సక్సెస్ కావు అనే సెంటిమెంట్ ఉంది. ‘శంకర్ దాదా జిందాబాద్’ (Shankar Dada Zindabad) ‘ఆర్య 2 (Aarya 2)‘ ‘కిక్ 2’ (Kick 2) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలు ఆడలేదు. అయితే కొన్ని సినిమాలు సీక్వెల్స్ పై ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ ను జయించాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

Tollywood Sequels

1) బాహుబలి 2 :

2013 లో వచ్చిన ‘బాహుబలి'(బాహుబలి ది బిగినింగ్) కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రానికి రాజమౌళి (S. S. Rajamouli) దర్శకుడు. ప్రభాస్ (Prabhas) హీరో. ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన సినిమా ఇది. ప్రభాస్ కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తెలుగులో (Tollywood) హిట్ అయిన తొలి సీక్వెల్ మూవీగా కూడా ‘బాహుబలి 2’ నిలిచింది.

2) దృశ్యం 2 :

విక్టరీ వెంకటేష్ (Venkatesh)  హీరోగా 2014 లో ‘దృశ్యం’ (Drushyam 2) సినిమా వచ్చింది.శ్రీప్రియ దర్శకురాలు. మలయాళం ‘దృశ్యం’ కి రీమేక్ ఇది. దీనికి కొనసాగింపు గా ‘దృశ్యం 2’ వచ్చింది. జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ (Jeethu Joseph) ను కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఈ సినిమా కూడా సక్సెస్ అందుకుంది

3) బంగార్రాజు :

నాగార్జున (Nagarjuna) హీరోగా 2015 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’ (Soggade Chinni Nayana) సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా రూపొందిన ‘బంగార్రాజు’ (Bangarraju) 2022 సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

4) ఎఫ్ 3 :

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati.), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej).లు హీరోలుగా 2019 సంక్రాంతికి ‘ఎఫ్ 2’ (F2 Movie)సినిమా విడుదలైంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 2022 సమ్మర్ కి దీనికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3‘ (F3 Movie) విడుదలైంది. అది కూడా బాగానే ఆడింది.

5) కార్తికేయ2 :

నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా 2014 లో ‘కార్తికేయ’ (Karthikeya) సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. చందూ మొండేటి (Chandoo Mondeti) దీనికి దర్శకుడు. దీనికి సీక్వెల్ గా 2022 ఆగస్టులో ‘కార్తికేయ2’ (Karthikeya 2) వచ్చింది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

6) హిట్ 2 :

2020 లో ‘హిట్’ (హిట్ : ది ఫస్ట్ కేస్) (HIT: The First Case) మూవీ వచ్చింది. శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా 2022 లో ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) (HIT: The Second Case) వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

7) పొలిమేర 2( మా ఊరి పొలిమేర 2) :

సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో డా.అనిల్ విశ్వనాథ్ (Anil Vishwanath) దర్శకత్వంలో ‘మా ఊరి పొలిమేర’ (Maa Oori Polimera) అనే సినిమా వచ్చింది. ఇది నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. దీనికి సీక్వెల్ గా ‘పొలిమేర 2’ (Maa Oori Polimera 2) వచ్చింది. 2023 చివర్లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అందుకుంది.

8) టిల్లు స్క్వేర్ :

సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా 2022 లో ‘డిజె టిల్లు’ (DJ Tillu) అనే సినిమా వచ్చింది. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) ఈ ఏడాది మార్చి నెలలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి వంద కోట్ల క్లబ్ లో చేరింది.

9) మత్తు వదలరా 2 :

2019 చివర్లో సింహా కోడూరి (Sri Simha Koduri),సత్య (Satya Akkala) ప్రధాన పాత్రల్లో ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) సినిమా వచ్చింది. రితేష్ రానా (Ritesh Rana) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దానికి సీక్వెల్ గా ఈ ఏడాది వచ్చిన ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2 ) సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది.

10) పుష్ప 2 :

అల్లు అర్జున్ (Allu Arjun) , దర్శకుడు సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప'(పుష్ప : ది రైజ్)  (Pushpa)  సూపర్ హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా రూపొందిన ‘పుష్ప 2′(పుష్ప : ది రూల్) (Pushpa 2: The Rule) నిన్న అంటే డిసెంబర్ 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది.

‘పుష్ప 2’ మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus