సోషల్ మీడియాలో ఫన్ కంటెంట్ క్రియేట్ చేస్తూ స్టార్ గా ఎదిగాడు మౌళి. అతని నుండి కొత్త వీడియో వస్తుందంటే ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు మౌళి. ఫైనల్ గా అతను హీరోగా డెబ్యూ ఇచ్చేశాడు. తన తొలి ప్రాజెక్టుకే టాప్ ఆర్డర్ టీం దొరికింది. వంశీ నందిపాటి, బన్నీ వాస్..లు బ్యాకప్ గా ఉండటం ఈటీవీ విన్ అధినేతలు నితిన్, సాయి.. 90’s ఆదిత్యతో కలిసి ‘లిటిల్ హార్ట్స్’ అనే చిత్రాన్ని నిర్మించారు.
సాయి మార్తాండ్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేయడంతో సినిమాకి బజ్ ఏర్పడింది. దానికి తోడు ప్రీమియర్స్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. సగంపైనే రికవరీ సాధించింది. 2వ రోజు కూడా సూపర్ గా నిలదొక్కుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.85 cr |
సీడెడ్ | 0.19 cr |
ఆంధ్ర(టోటల్) | 0.92 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.96 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.09 cr |
ఓవర్సీస్ | 0.12 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.17 cr (షేర్) |
‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.2.17 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ.3.83 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.17 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకు సాగుతుంది.ఆదివారం రోజున మరింతగా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.