Bigg Boss 5 Telugu: కళ్లుతిరిగి పడిపోయిన లోబో అసలు ఏం జరిగింది..?

బిగ్ బాస్ హౌస్ లో పంతం నీదా నాదా సై అనే టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఒకవైపు ఉల్ఫ్ టీమ్ ఈగల్ టీమ్ తో బాటిల్ చేస్తున్న సమయంలో ఈగల్ టీమ్ లో ఉన్న లోబో ఉన్నట్లుండి సోఫాలో పడిపోయాడు. ఆపోజిట్ టీమ్ లో ఉన్న రవి వచ్చి లోబోని లేపాడు. అక్కడే ఉన్న లహరి కూడా సాయం చేసింది. టీమ్ లీడర్ అయిన మానస్ కూడా వచ్చాడు. ఇలా అపోజీట్ టీమ్ కూడా గేమ్ ఆడటం మానేసి మరీ వచ్చారు. కానీ, ఇక్కడే లోబో కళ్లుతిరిగి పడిపోయాడని తెలిసినా కూాడ ఉమాదేవి అండ్ కాజల్ ఇద్దరూ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు. నిజానికి టాస్క్ లో జరిగిన తోపులాటలోనే లోబోకి కళ్లుబైర్లు కమ్మాయి.

మానస్ డాక్టర్ ని రమ్మని బిగ్ బాస్ కి చెప్పాడు. బిగ్ బాస్ ఆదేశాలతో లోబో మెడికల్ రూమ్ కి వెళ్లాడు. ఇక్కడే నటరాజ్ మాస్టర్ కాసేపు ఆగండి మేము వచ్చేవరకూ అంటూ గేమ్ లో పాజ్ ఇమ్మని చెప్పాడు. కానీ, వాష్ రూమ్ లో మళ్లీ చిన్నసైజు పిల్లోల కోసం చిన్న పాటి యుద్ధమే జరిగింది. మానస్ దగ్గరున్న బాటెన్స్ ని గుంజుకునే ప్రయత్నం చేసింది ఈగల్ టీమ్. అంతకుముందు లోబో పడిపోయినపుడే విశ్వకి రవికి పెద్ద ఘర్షణ మొదలైంది. అసలు నువ్వు గేమ్ స్ట్రాటజీ అని ఎందుకు మాట్లాడతావ్ అంటూ రవిని టార్గెట్ చేసి అడిగాడు విశ్వ.. దీనికి రవి ఎక్స్ ప్లనేషన్ ఇస్తూనే ప్రస్టేట్ అయ్యాడు.

రవి ఛీ అంటూ మాట్లాడేసరికి విశ్వ ట్రిగ్గర్ అయ్యాడు. మాటలు మంచిగా మాట్లాడు అంటూ రెచ్చిపోయాడు. ​కానీ, ఈమద్యలోనే శ్రీరామ్ చంద్ర బెడ్ రూమ్ లోకి ఉరిగి వెళ్లి పిల్లోస్ దక్కించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ కాజల్ అండ్ ఉమాదేవిలని కవ్వించాడు శ్రీరామ్. కానీ, కాసేపటి తర్వాత నేను మెడిసిన్ కోసమే అలా పరిగెత్తుకుంటూ వెళ్లానని ఎక్స్ ప్లైన్ చేశాడు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో రవి ఫైనల్ గా విశ్వ దగ్గరకి వచ్చి తను అన్నమాటలకి సారీ కూడా చెప్పాడు. ఇక్కడితో ఈ ఆర్గ్యూమెంట్ కి ఎండ్ కార్డ్ పడింది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus