‘సలార్’ సినిమాకు తొలి వారాంతంలో వచ్చిన వసూళ్లు, హైప్ ఆ తర్వాత కంటిన్యూ అవ్వలేదని ఇప్పటికే మనం చదువుకున్నాం. ఎందుకు, ఏంటి అనే విషయాల్ని ఆ టీమ్ చూసుకుంటోంది. అయితే ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సొంత గడ్డ మీద ఈ సినిమాకు ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అక్కడ వసూళ్లు తక్కువ అనే చర్చ జరుగుతుంటే, ఇప్పుడు ఓ లోకల్ సినిమా రావడంతో ‘సలార్’ సైడ్ అయిపోయాడు అని అంటున్నారు.
‘సలార్’ సినిమా ఈ నెల 22న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు రూ. 500 కోట్ల గ్రాస్ వచ్చింది అని టీమ్ అనౌన్స్ చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వసూళ్లు అంత ఎక్కువగా లేవు అని చెబుతున్నారు. అందులో ఫస్ట్ ప్లేస్‌లో బాలీవుడ్ ఉంటే, రెండో స్థానంలో శాండిల్ వుడ్ అని చెబుతున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా ఉండటంతో ప్రభాస్ ‘సలార్’కు ఆశించిన థియేటర్లు రాలేదు. శాండిల్ వుడ్‌లో ‘కాటేరా’ వల్ల అని చెప్పొచ్చు.
దర్శన్ ప్రధాన పాత్రలో కన్నడలో రూపొందిన చిత్రం ‘కాటేరా’. లోకల్ స్టైల్ రా అండ్ రస్టిక్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాకు భారీ విజయం దక్కింది. ‘సలార్’ కన్నడ వెర్షన్ వారంలో సంపాదించిన వసూళ్లు ఆ సినిమా రెండు రోజుల్లోనే సంపాదించేసిందట. దీంతో ప్రశాంత్ నీల్‌కు కన్నడ అభిమానులు ఆశించిన స్థాయిలో ఆదరించలేదు అనిపిస్తోంది. దీంతో ‘సలార్ 2’ విషయంలో ఈ వసూళ్ల లెక్కను మైండ్‌లో పెట్టుకోవాలి అని అంటున్నారు.
కన్నడలో ‘సలార్’ సినిమా పది రోజుల్లో రూ. 35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ఓ లెక్క. ‘కాటేరా’ వసూళ్లు బాగుడటంతో ప్రభాస్ సినిమాను పక్కన పెట్టి ఆయా స్క్రీన్లలో ఆ సినిమానే వేస్తున్నారట. ఫైనల్‌గా ‘సలార్’కు ఎందుకు వసూళ్లు తక్కువ అని అడిగితే… ‘ఉగ్రం’ సినిమాకు ఇది ఎక్స్‌టెన్షన్ అని టీమ్ నుండి లీకులు రావడం, సినిమా వచ్చాక అలాగే ఉండటంతో కన్నడ జనాలు థియేర్లకు రాక తగ్గించేశారు. అదే కారణం అని చెప్పొచ్చు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!