వరుణ్ సినిమాకి లాక్ డౌన్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలిందే..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కు ముందు కొంత జరిగింది. మిగతాది లాక్ డౌన్ తర్వాత జరుగనుంది. వరుణ్ ఈ చిత్రంలో భాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకోసం స్పెషల్ గా నీరజ్ గోయత్ అనే విదేశీ ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకుని ఫిట్ గా తయారయ్యాడు.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండడం… ఎటువంటి వర్కౌట్ లు చేయకపోవడం… నచ్చింది తినడం కారణంగా వరుణ్ మళ్ళీ వెయిట్ పెరిగాడు అని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు లాక్ డౌన్ ముగిసి షూటింగ్ లు ప్రారంభం అయినా… వరుణ్ మళ్ళీ వర్కౌట్ లు చేసి ఫిట్ గా తయారవ్వాల్సి ఉంది. అంటే దానికి మళ్ళీ 3 నుండీ 4 నెలల వరకూ సమయం పడుతుందని సమాచారం. కాబట్టి వరుణ్ తేజ్ ఇప్పటి వరకూ కష్టపడింది వేస్ట్ అయిపోయినట్టే అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా వరుణ్ … ఈ చిత్రంతో పాటు ‘ఎఫ్3’ సీక్వెల్ లో కూడా నటించాల్సి ఉంది. ఆ చిత్రం షూటింగ్ కూడా లాక్ డౌన్ తర్వాతే మొదలుకానుంది. దీంతో ఈ రెండు చిత్రాల్లోనూ వరుణ్ ఒకసారి నటిస్తాడా…? ‘ఎఫ్2’ లో ఎలాగూ బొద్దు గానే ఉంటాడు కాబట్టి.. ‘ఎఫ్3’ లో కూడా వరుణ్ బొద్దుగానే కనిపించాల్సి ఉంది. మరి వరుణ్ రెండు ప్రాజెక్ట్ లను ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి..!

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus