Lokesh Kanagaraj: లోకేశ్‌ కనగరాజ్‌ ప్రాజెక్ట్స్‌.. గురువుకు డైరక్షన్‌… శిష్యుడికి కథ!

ఒకేసారి హీరోతో, అతని ఫ్యాన్‌ అయిన మరో హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది అంది ఆ దర్శకుడు భలే అదృష్టవంతుడు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి లక్‌ అందుకున్న డైరక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). ‘ఖైదీ’ (Kaithi), ‘మాస్టర్’(Master) , ‘విక్రమ్‌’ (Vikram) సినిమాలతో బాక్సాఫీసు దగ్గర బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్న ఆయన… ఇప్పుడు ఇతర దర్శకులకు కథలు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో ఆయన ఓ కథను లారెన్స్‌కు (Raghava Lawrence) ఇచచారు. అలా గురువుకు డైరక్షన్‌… శిష్యుడికి కథ ఇచ్చినట్లు అయింది.

తమిళ నూతన సంవత్సరం సందర్భంగా కోలీవుడ్‌ సినిమాలను ఆదివారం వరుస పెట్టి అనౌన్స్‌ చేశారు. ఈ క్రమంలో లారెన్స్‌ కొత్త సినిమాలు కూడా వచ్చాయి. అందులో లోకేశ్‌ కనగరాజ్‌ కథ అందించిన సినిమా కూడా ఉంది. రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా ‘బెంజ్‌’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ‘రెమో’ సినిమా ఫేమ్‌ భాగ్యరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న ఆ సినిమాకు లోకేశ్‌ కథ అందించారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ… ‘బెంజ్‌’ సినిమాను తెరకెక్కిచాలనే తన కల ఇప్పుడు నెరవేరుతోంది అని చెప్పారు.

నాకెంతో ఇష్టమైన రాఘవ లారెన్స్‌తో ‘బెంజ్‌’ ప్రాజెక్టు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని లోకేశ్‌ చెప్పాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తారట. ఇదిలా ఉండగా… వెంకట్‌ మోహన్‌ దర్శకత్వంలో ‘హంటర్‌’ అనే సినిమాను కూడా ప్రకటించారు. ఈ వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తారు అని చెబుతున్నారు.

ఇక లోకేశ్‌ కనగరాజ్‌ తన తర్వాతి సినిమాగా రజనీకాంత్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. తలైవా 171 (Thalaivar 171) సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ నెల 17న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఇందులో రజనీకాంత్‌ (Rajinikanth) బంగారం స్మగ్లింగ్‌ చేసే డాన్‌ పాత్రలో కనిపిస్తాడట. ఈ క్రమంలో పాత్రలో కాస్త నెగిటివ్‌ టచ్‌ కూడా ఉంటుంది అని ఇప్పటికే లోకేశ్‌ చెప్పారు. ఇందులోనే లారెన్స్‌ ఓ పాత్ర చేస్తున్నారని టాక్‌ కూడా వినిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus