Love Today: బుల్లితెరపై కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేసిన ‘లవ్ టుడే’

తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కూడా మారి ‘లవ్ టుడే’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అతను తెరకెక్కించిన ‘అప్పా లాక్’ అనే షార్ట్ ఫిలింని ఎక్స్టెండ్ చేసి ‘లవ్ టుడే’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రదీప్.’ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం,కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2022 లో మొదట తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని..

నవంబర్ 25న తెలుగులో కూడా విడుదల చేశారు. ఇవానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో యోగి బాబు, రాధిక కీలక పాత్రలు పోషించారు.’లవ్ టుడే’ కథంతా ఫోన్, సోషల్ మీడియా ఖాతాల నేపథ్యంలో సాగుతుంది. డీప్ లవ్ లో ఉండి పెళ్ళికి రెడీ అయిన ఇద్దరు ప్రేమికులు..ఉంగరాలకు బదులు ఫోన్లు మార్చుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రదీప్ రంగనాథన్.

తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. థియేటర్లలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో డిజిటల్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకి స్టార్ మా వారు కొనుగోలు చేశారు. అందుతున్న సమాచారం ప్రకారం రూ.3 కోట్ల రేటు చెల్లించి మరీ ఈ చిత్రాన్ని వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఇటీవల… అంటే ఏప్రిల్ 9న సాయంత్రం ‘లవ్ టుడే’ (Love Today) టెలివిజన్ ప్రీమియర్ టెలికాస్ట్ అవ్వగా.. మొదటిసారి 6.1 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. దీంతో స్టార్ మా వారు చాలా వరకు రికవరీ సాధించినట్లు తెలుస్తోంది. రెండోసారి టెలికాస్ట్ తో లాభాలు పట్టే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus