యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇందుకోసం తండ్రి బెల్లంకొండ సురేష్ కోట్లు ఖర్చుపెట్టారు. ఆ తర్వాత నుంచి అదే విధంగా వస్తున్నారు. తన సినిమాకి స్టార్ హీరోయిన్, సీనియర్ టెక్నీషియన్స్, ఫారెన్ లొకేషన్స్, భారీ సెట్లు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్.. ఇలా అంతా ఓ రేంజ్ లో ఉండాలని డిమాండ్ చేస్తుంటారు. దీంతో బడ్జెట్ 30 కోట్లు దాటిపోతోంది. రీసెంట్ గా వచ్చినా “సాక్ష్యం” సినిమాకి కూడా 30 కోట్లు ఖర్చు అయింది. 40 కోట్లకు బిజినెస్ జరిగింది. కలక్షన్స్ మాత్రం 15 కోట్లు దాటలేదని సమాచారం. దీంతో భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ నష్టాన్ని బెల్లకొండ సురేష్ పూడ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే శ్రీనివాస్ చేసిన గత చిత్రాలకు రెమ్యునరేషన్ దేవుడెరుగు..
సొంత డబ్బులు పెట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు. “సాక్ష్యం” దెబ్బకి బెల్లకొండ మారిపోయినట్టు తెలిసింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కే చిన్న కథలను వింటున్నట్టు టాక్. స్టార్ డైరక్టర్స్ తో కాకుండా కొత్త డైరక్టర్లతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వరుసగా కథలను వినడంలోనే బిజీగా ఉన్నారు. తన స్థాయి ఎంత? ఎంత ఖర్చు పెట్టవచ్చు? ఎంత రాబట్టగలదు? అని బెల్లంకొండ అవగాహనకు రావడం మంచి పరిమాణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సారి అయినా అతని సినిమా లాభాలను అందుకుంటుందేమో చూడాలి.