Ante Sundaraniki: నాని సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా..?

యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ సినిమా ‘అంటే సుందరానికీ’. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ విషయంపై స్పందించిన నాని తన సినిమాను ఆవకాయ్ తో పోల్చారు. ఆవకాయ్ రుచి రోజురోజుకి పెరుగుతుందని.. అలానే తన సినిమా రోజురోజుకి బెటర్ అవుతుందని అన్నారు. కానీ నాని చెప్పినట్లుగా తన సినిమా బెటర్ అవ్వడం లేదు. మొదటి మూడు రోజులు ఈ సినిమా బాగానే ఆడింది. రీసెంట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి.

కానీ సోమవారం నుంచి ఈ సినిమా దారుణంగా పడిపోయింది. మొదటి మూడు రోజులతో పోలిస్తే ఆక్యుపెన్సీ 70 శాతం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక వసూళ్ల పరంగా చూసుకుంటే.. సోమవారం నాడు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.70 లక్షల షేర్ వచ్చింది. మంగళవారం నాడు షేర్ ఇంకాస్త తగ్గింది. ఈ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం దడపా అసాధ్యమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.

నిజానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంది. అది తప్పిస్తే జనాల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. అయినప్పటికీ.. సోమవారం నుంచి కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తోంది. పోనీ జనాలు థియేటర్లకు రావట్లేదా..? అంటే అదీ కాదు. ‘విక్రమ్’ సినిమా రన్ బాగానే ఉంది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తున్నాయి. మరి నాని సినిమా ఎందుకిలా అయిందనేది అందరి అనుమానం.

మరో రెండు రోజుల్లో రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటికి నాని సినిమా చతికిలపడడం ఖాయమంటున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus